Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ 113 సార్లు సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించారు: CRPF

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పలు మార్లు సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినట్లు సీఆర్‌పీఎఫ్ వెల్లడించింది.

Continues below advertisement

Bharat Jodo Yatra: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గురువారం తెలిపింది. కాంగ్రెస్ పార్టీ చేసిన భద్రతా లోపాల ఆరోపణలను CRPF తోసిపుచ్చింది.

Continues below advertisement

రాహుల్ గాంధీకి నిర్దేశించిన భద్రతా మార్గదర్శకాలను ఆయన ఉల్లంఘించినట్లు అనేక సందర్భాల్లో గమనించాం. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ఆయన దృష్టికి తీసుకువెళ్లాం.                -      సీఆర్‌పీఎఫ్ ప్రకటన 

దిల్లీలో 'భారత్ జోడో యాత్ర' సందర్భంగా "భద్రతా ఉల్లంఘనలు" జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ గాంధీ సహా యాత్రలో పాల్గొనే వారికి తగిన భద్రతను కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ బుధవారం లేఖ రాసింది. ఈ లేఖకు ప్రతిస్పందనగా సీఆర్‌పీఎఫ్ వివరణ ఇచ్చింది.

రాహుల్ గాంధీకి అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర పోలీసులు, భద్రతా సంస్థల సమన్వయంతో CRPF అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 24న దిల్లీలో జరిగిన భారత్ జోడో యాత్రకు అన్ని భద్రతా ఏర్పాట్లు మార్గదర్శకాలకు అనుగుణంగా చేశారు. అలానే తగినంత భద్రతా సిబ్బందిని మోహరించినట్లు దిల్లీ పోలీసులు తెలియజేసారు.                           -    సీఆర్‌పీఎఫ్

113 సార్లు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 2020 నుంచి ఇప్పటివరకు 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని సీఆర్‌పీఎఫ్ వెల్లడించింది. ఇదే విషయాన్ని ఆయనకు తెలియజేశారని పేర్కొంది.

2020 నుంచి 113 సార్లు రాహుల్ గాంధీ భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు గమనించాం. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ఆయనకు తెలియజేశాం. దిల్లీలో జరిగిన భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ మార్గదర్శకాలను ఉల్లంఘించారు.                                          -      సీఆర్‌పీఎఫ్

Also Read: Lokayukta Bill: లోకాయుక్త బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర

Continues below advertisement