(Source: ECI/ABP News/ABP Majha)
PM Modi In Kashi : రజనీ స్టైల్ పంచెకట్టులో ప్రధాని మోదీ - కాశీలో తమిళ సంగమం అదుర్స్ !
కాశీలో జరిగిన తమిళ సంగమంలో ప్రధాని మోదీ పంచెకట్టులో పాల్గొన్నారు. నెల రోజుల పాటు తమిళ సంగమం జరగనుంది.
PM Modi In kashi: కాశీ, తమిళనాడు బలమైన సాంస్కృతిక మూలాలు కలిగి ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కాశీకి సంస్కృతం, తమిళనాడుకు తమిళం పురాతన భాషలుగా విరాజిల్లుతున్నాయన్నారు. కాశీ తమిళ సంగం కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో సమావేశానికి ప్రధాని హాజరయ్యారు. ఈ సమావేశానికి వచ్చినవారిని ప్రత్యేకంగా పలకరించారు ప్రధాని మోదీ. కాశీలో 30 రోజుల పాటు ద్రవిడ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సంగమంలో తమిళ విద్యార్థులు, రచయితలు, పండితులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు.
📡LIVE Now
— PIB India (@PIB_India) November 19, 2022
PM @narendramodi inaugurates #KashiTamilSangamam in Varanasi, #UttarPradesh
Watch on #PIB's 📺
YouTube: https://t.co/1fJVZ4eCKP
Facebook: https://t.co/p9g0J6q6qv https://t.co/3m5NCwShE4
భారతీయ సనాతన సంస్కృతికి చెందిన రెండు ముఖ్యమైన పురాతన పౌరాణిక కేంద్రాల కలయిక అని మోదీ ఈ కార్యక్రమాన్ని అభివర్ణించారు. తమిళనాడులోని 12 ప్రధాన దేవాలయాల మఠాధిపతులు కాశీలో మొదటి సత్కారం అందుకుంటున్నారన్నారు. కాశీ-తమిళనాడుల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని మోదీ వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా దక్షిణాది, ఉత్తరాది మధ్య. ఉన్న సంస్కాృతిక సారూప్యం వెల్లడవుతుందన్నారు. శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామేశ్వరం జ్యోతిర్లింగంతో పాటు స్వయంభూ కాశీ విశ్వనాథుని వైభవాన్ని కాశీలో వివరించనున్నారు.
కాశీ విశ్వనాథ ఆలయం తమిళనాడులోని తెన్కాసి నగరంలో ఉంది. తమిళనాడు నిపుణుల అభిప్రాయం ప్రకారం, శివునికి అంకితం చేయబడిన కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఉలగమ్మన్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది పాండ్యన్ల పాలనలో నిర్మించబడింది , ఇది తమిళనాడులో రెండవ అతిపెద్ద గోపురం. ద్రావిడ శైలిలో నిర్మించిన ఈ ఆలయ గోపురం 150 అడుగులు. అదేవిధంగా తమిళనాడులోని కాశీ, మఠం ఆలయాల సంప్రదాయాలు కూడా అలాగేఉంటాయి. తమిళనాడుకు చెందిన ద్రవిడ సంస్కృతి గురించి యూపీలో ప్రదర్శన చేయనున్నారు. తమిళ వంటకాలు అక్కడ గుమగుమలాడనున్నాయి. తమిళ సంగీతం కూడా కాశీలో మారుమోగనున్నది.
Kashi & Tamil Nadu both are sources of music, literature and art. Kashi's tabla & Tamil Nadu's Thannumai are famous. In Kashi, you'd get Banarasi saree & in Tamil Nadu you'd see kanjivaram silk which are known across the world: PM Modi at ‘Kashi Tamil Sangamam' in UP's Varanasi pic.twitter.com/QIfTvSjFKR
— ANI (@ANI) November 19, 2022
కాశీ తమిళ సంగమం కోసం రామేశ్వరం నుంచి ప్రత్యేక రైలులో 216 మంది వారణాసి చేరుకున్నారు. ఆ బృందానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతం పలికారు. కాశీలో 30 రోజుల పాటు ద్రవిడ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కాశీ తమిళ సంగమం ఈవెంట్‌లో పాల్గొనేందుకు సుమారు మూడు వేల మంది తమిళనాడు భక్తులు 12 బృందాలుగా కాశీ చేరుకోనున్నారు. వారి వారి విభాగాలతో సంభాషించడానికి, స్థానిక నివాసితులతో సంభాషించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. తమిళ సంగమం సందర్భంగా కాశీ నగరం సంబరాలతో నిండిపోయింది. తమిళనాడు నుంచి కాశీ వచ్చిన వారినిక ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా మరియు ‘ఏక్ భారత్ శ్రేష్ట భారత్’ స్ఫూర్తిని నిలబెట్టేందుకు భారత ప్రభుత్వం ఈ సంగమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి తిరుక్కురల్ మరియు కాశీ-తమిళ సంస్కృతికి సంబంధించిన పుస్తకాలను విడుదల చేశారు మరియు తమిళ విద్యార్థులతో సంభాషించారు.