Just In





Pratik Suri: ఢిల్లీలో చదివి ఆఫ్రికాలో జెండా పాతాడు - స్మార్ట్ టీవీల అమ్మి బిలియనీర్‌గా ఎదిగిన ప్రతీక్ సూరి !
Young Suri : ఆఫ్రికాలో రిచ్చెస్ట్ ఇండియన్‌గా ప్రతీక్ సూరి అనే యువకుడు ఎదిగాడు. ఢిల్లీలో చదువుకుని అక్కడికి వెళ్లిన కొద్ది కాలంలోనే ధనవంతడు అయ్యాడు.

Richest Indian African : ఆఫ్రికాలో రిచ్చెస్ట్ ఇండియన్ బిలియనీర్ గా ప్రతీక్ సూరి నిలిచారు. ఆయనకు 1.4 బిలియన్ డాలర్ల సంపద ఉంది. ప్రతీక్ సూరి ఏమీ వ్యాపావేత్తల వారసుడు కాదు. ఆయన చదువు కోసం దుబాయ్ కు వెళ్లి అక్కడి నుంచి ఆఫ్రికా వెళ్లి అనతి కాలంలోనే బిలియనీర్ అయ్యాడు. ఆయన కంపెనీ పేరు మేనర్. ఆఫ్రికాలో స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆయన బ్రాండ్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి . పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలను ఆయన అధిగమించారు.
ఢిల్లీకి చెందిన ప్రతీక్ సూరి తన స్కూల్ ఎడ్యుకేషన్‌ను బరాఖంబా రోడ్‌లోని మోడరన్ స్కూల్‌లో పూర్తి చేశాడు. 2006లో దుబాయ్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌ను చదివేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి వెళ్లాడు. అక్కడే చదువుకుని.. కొన్ని ఉద్యోగాలు చేసి చివరికి ప్రతీక్ సూరి తన వ్యాపార ప్రయాణాన్ని 2012లో ప్రారంభించారు. ఆయన ఆఫ్రికా మార్కెట్ కోసం సరసమైన ధరల్లో వినియోగదారు ఎలక్ట్రానిక్స్ అందించే లక్ష్యంతో మేసర్ గ్రూప్ ను స్థాపించారు. మేసర్ గ్రూప్ ప్రజలకు సరసమైన టెక్నాలజీని అందించడం అనే లక్ష్యాన్నిపెట్టుకుంది. ఈ సంస్థ ప్రధాన ఉత్పత్తి అయిన స్మార్ట్ టెలివిజన్ ఆఫ్రికా అంతటా 800,000 యూనిట్లకు పైగా అమ్ముడై, ఆఫ్రికా మార్కెట్‌లో గణనీయమైన ప్రభావాన్ని చూపింది.
కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తి అయిన స్మార్ట్ టీవీ ఆఫ్రికన్ మార్కెట్‌లో అనూహ్యంగా మంచి ఆదరణ పొందింది. మాసర్ గ్రూప్ 2023లో 1.9 బిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో 15780 కోట్లు విలువను చేరుకుంది. దీనితో సూరిని "ఆఫ్రికా టెక్నాలజీ టైగర్" అని పిలవడం ప్రారంభించారు. 2024లో, మేసర్ గ్రూప్ SCG ఆసియాతో స్వాధీన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఫలితంగా సూరి 1.4 బిలియన్ డాలర్ల నికర విలువతో ఆఫ్రికా అత్యంత యువ బిలియనీర్‌గా అవతరించారు. ఆయనను ఆఫ్రికా అత్యంత ప్రభావశీల వ్యాపారవేత్తలలో ఒకరిగా నిలిచారు.
ప్రతీక్ సూరి ఆఫ్రికాలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.