PM Modi Flags Off Vandhe Bharat Trains: దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో రైల్వేశాఖ కీలక అడుగులు వేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల వారు సౌకర్యవంతంగా ప్రయాణించేంత వరకు తాము ఆగబోమని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ మూడు వందేభారత్ రైళ్లను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాల నుంచి అవరోధాలను తన కష్టంతో రైల్వే శాఖ అధిగమించినట్లు ఆయన చెప్పారు. కేవలం సమస్యలకు పరిష్కారం చూపడమే కాకుండా.. రైల్వే కొత్త ఆశలు చిగురింపజేస్తోందన్నారు. నేటి నుంచి మీరట్-లక్నో మధ్య వందే భారత్ రైలు నడుస్తుంది. మీరట్-లక్నో, మదురై-బెంగళూరు, చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవానికి దక్షిణాది రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందడం కీలకమని ప్రధాని చెప్పారు.
వందే భారత్ కు భారీ డిమాండ్
వందేభారత్ రైలు వల్ల మీరఠ్- లక్నో మధ్య దాదాపు గంట మేర ప్రయాణ సమయం ఆదా అవుతుందని తెలిపారు. నేడు నగరంలో ప్రతి రూట్‌లో వందే భారత్‌కు డిమాండ్ ఉంది. హై-స్పీడ్ రైళ్ల రాక ప్రజలు తమ వ్యాపారాన్ని, ఉపాధిని, వారి కలలను విస్తరించుకునే విశ్వాసాన్ని ఇస్తుందన్నారు. నేడు దేశవ్యాప్తంగా 102 వందే భారత్ రైల్వే సర్వీసులు నడుస్తున్నాయి. ఇదొక్కటే కాదు ఉత్తరాది నుంచి దక్షిణాదికి దేశాభివృద్ధి ప్రయాణంలో నేడు మరో అధ్యాయం చేరుతోందన్నారు.
కనెక్టివిటీని పెంచాయి
మధురై-బెంగళూరు, చెన్నై-నాగర్‌కోయిల్, మీరట్-లక్నో మధ్య వందే భారత్ రైలు సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వందేభారత్ రైళ్ల విస్తరణ, ఈ వేగం, అభివృద్ధి చెందిన భారతదేశం వైపు మన దేశం అంచెలంచెలుగా పయనిస్తోంది. ఈరోజు ప్రారంభమైన మూడు వందే భారత్ రైళ్లు దేశంలోని ముఖ్యమైన నగరాలు, చారిత్రక ప్రదేశాలకు కనెక్టివిటీని అందించాయి. ఈ రైళ్లు యాత్రికులకు సౌకర్యాన్ని కల్పిస్తాయి. విద్యార్థులు, రైతులు, ఐటీ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. వందేభారత్ సౌకర్యాలు చేరుకుంటున్న చోట పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం నెరవేరాలంటే దక్షిణాది రాష్ట్రాల సత్వర అభివృద్ధి ఎంతో అవసరమన్నారు. దక్షిణ భారతదేశంలో అపారమైన ప్రతిభ, అపారమైన వనరులు, అవకాశాలు ఉన్నాయి.
దక్షిణాదికి మా ప్రాధాన్యత
కాబట్టి తమిళనాడు, కర్ణాటక సహా మొత్తం దక్షిణాది అభివృద్ధి మా ప్రభుత్వ ప్రాధాన్యత. గత 10 ఏళ్లలో ఈ రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ధే ఇందుకు ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో తమిళనాడుకు రూ.6 వేల కోట్లకు పైగా రైల్వే బడ్జెట్ ఇచ్చాం. ఇది 2014 బడ్జెట్ కంటే 7 రెట్లు ఎక్కువ. అదేవిధంగా ఈసారి కర్ణాటకకు కూడా రూ.7 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. ఈ బడ్జెట్ కూడా 2014 కంటే 9 రెట్లు ఎక్కువ. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయట పడగలిగారని ప్రధాని చెప్పారు. గత సంవత్సరాల్లో రైల్వే తన కఠోర శ్రమతో దశాబ్దాల నాటి సమస్యలను పరిష్కరిస్తానని ఆశలు రేకెత్తించింది. అయితే ఈ దిశగా మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. భారతీయ రైల్వేలు పేద, మధ్యతరగతి అందరికీ ఆహ్లాదకరమైన ప్రయాణానికి హామీ ఇచ్చే వరకు మేము ఆగబోమని ప్రధాని అన్నారు.