PM Narendra Modi Address To Nation : PM Narendra Modi Address To Nation : భారత్ తో చర్చలు అంటూ జరిగితే అది పీవోకే మాత్రమేనని  ప్రధాని మోదీ స్పష్టం చేశారు.  ఉగ్రవాదంపై పోరులో ప్రపంచం మన శక్తిని చూసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తర్వాత మొదటి సారి ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా బలగాల ధైర్యసాహసాలను అభినందించారు. బలగాలకు వందనం చేస్తున్నానని అన్నారు. మన సైన్యం అసాధారణ ధైర్యాన్ని చూపిందని అన్నారు. పహల్గాం లో ఉగ్రవాదులు పర్యాటకుల్ని టార్గెట్ చేశారని తెలిపారు. అత్యంత దారుణంగా కుటుంబ సభ్యుల ముందే హత్య చేశారని అన్నారు. తనకు వ్యక్తిగతంగా ఇది ఎంతో కఠినమైన విషయమని మోదీ అన్నారు. ఈ ఉగ్రవాద చర్యను దేశమంతా ఖండించిందని తెలిపారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇచ్చామన్నారు. దేశంలో మహిళల సిందూరాన్ని దూరం చేస్తే ఏం జరుగుతుందో చూపించామన్నారు.  

ఆపరేషన్ సిందూర్ భారతీయుల్ని మనోభావాల్ని ప్రతిబింబించిందని మోదీ తెలిపారు. ఏడో తేదీన తెల్లవారుజామున ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడి చేసిందన్నారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని రీతిలో దాడి జరిగిందని మోదీ తెలిపారు. నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ఈ నిర్ణయం  తీసుకున్నామన్నారు. ప్రపంచ ఉగ్రవాదానికి బావహాల్ పూర్, మురిద్కో, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాలు యూనివర్శఇటీలుగా ఉన్నాయని మోదీ తెలిపారు. అందుకే ఆయా ప్రాంతాలపై మిస్సైళ్లతో సైన్యం విరుచుకుపడిందని తెలిపారు. వంద మంది కరుడు గట్టిన ఉగ్రవాదులను ముట్టుబెట్టామని తెలిపారు. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోదని ప్రధాని స్ప,,్్టం చేశారు. భారత్ దాడులతో ఉగ్రవాదులు హడలిపోయారని.. ఒక్క దెబ్బతో ఉగ్రవాద నాయకుల్ని హతమార్చామని తెలిపారు. 

ఉగ్రవాదం తర్వాత దేశం అంతా ఒక్కటిగా నిలిచిందని మోదీ అన్నారు. అయితే ఉగ్రవాదుల్ని అంతం చేయాల్సిన పాకిస్తాన్ మనపై ఎదురుదాడికి దిగిందన్నారు. స్కూల్స్, ఆస్పత్రులు,గురుద్వారాలను టార్గెట్ చేసింది. పాకిస్తాన్ ఏ విధంగా వ్యవహరించిందో ప్రపంచం అంతా చూసిందన్నారు. పాకిస్తాన్ మిస్సైల్స్ అన్నీ మన రక్షణ వ్యవస్థల ముందు తేలిపోయాయని స్పష్టం  చేశారు. పాకిస్తాన్ వేసన మిస్సైల్స్, డ్రోన్స్ భారత్ లోకి రాలేకపోయాయన్నారు. కానీ మనం మాత్రం పాకిస్తాన్ గుండెల్లో బాంబులు పేల్చామని స్పష్టం చేశారు. 

భారత్ ప్రతి దాడి తర్వాత బతికి ఉంటే చాలని పాకిస్తాన్ అనుకుంటోందని మోదీ  తెలిపారు. కలలో కూడా ఉలిక్కిపడేలా పాకిస్తాన్ను దెబ్బతీశామని ప్రధాని తెలిపారు. పాకిస్తాన్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేశాం.. మన దాడితో పాకిస్తాన్ ఆత్మరక్షణలో పడిపోయిందని మోదీ తెిలపారు. పాకిస్తాన్ తదుపరి చర్యలపై ఓ కన్నేసి ఉంంచామన్నారు. అణుదాడి చేస్తామని బెదిరిస్తే సహించేది లేదన్నారు. పాక్ తోక జాడిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. భారత్ దాడులకు తాళలేక ప్రపంచం ముందు పాకిస్తాన్ సాయం కోసం కాళ్లపై పడిందన్నారు. మే పదో తేదీన పాకిస్తాన్ డీజీఎంవో భారత్ ను సంప్రదించిందని మోదీ తెలిపారు. అప్పటికే పాకిస్తాన్ లో ని ఉగ్రమూకల్ని తుదముట్టించామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ను నిలిపివేశామని.. పాకిస్తాన్ తదుపరి చర్యలను బట్టి.. రియాక్షన్ ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. 

ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు ఓ కొత్తరహాలో జవాబు చెప్పామని.. ఇక ఉగ్రవాదంతో  ఏదో చేయాలని అనుకుంటే పాకిస్తాన్ కు ఇక ఇదే తరహాలో సమాదానం చెబుతామన్నారు. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదులకు బుద్ది చెప్పామన్నారు. భారత్ పై ఉగ్రవాదంతో మళ్లీ దాడి చేస్తే ముఖం పగిలే రీతిలో సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. అణ్వాయుధాలను అడ్డం పెట్టుకుని ఉగ్రవాదానికి పాల్పడతామని అంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. చనిపోయిన ఉగ్రవాదుల్ని చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారని మోదీ గుర్తు చేశారు.  దీన్ని బట్టి ఉగ్రవాదుల వెనుక పాక్ ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారన్న విషయం స్పష్టమవుతోందన్నారు. యుద్ధ మైదానంలో ప్రతి సారి పాకిస్తాన్ దుమ్ము దులిపామని స్పష్టం చేశారు. పాక్ తో చర్చలంటూ ఉంటే అది పీవోకే మాత్రమేనని మోదీ స్పష్టం చేసారు.