ఒకేసారి 15 ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

Airport Projects: ప్రధాని మోదీ ఒకేసారి 15 ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

Continues below advertisement

15 Airport Projects: ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి 15 ఎయిర్‌పోర్ట్‌ల (PM Modi Launches Airport Projects) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందులో 12 కొత్త టర్మినల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. యూపీలోని అజమ్‌ఘడ్ పర్యటనకు వెళ్లిన ఆయన వర్చువల్‌గా వీటిని ప్రారంభించారు. ఈ అన్ని ప్రాజెక్ట్‌ల విలువ రూ.9,800 కోట్లుగా ఉంది. ఈ కొత్త టర్మినల్స్‌తో అదనంగా ఏటా 6.2 కోట్ల మంది ప్రయాణించేందుకు వెసులుబాటు కలగనుంది. ఈ టర్మినల్స్‌ సామర్థ్యాన్ని పెంచేందుకే వాటి రూపు రేఖలు మారుస్తున్నట్టు  ప్రభుత్వం వెల్లడించింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యంత అధునాతన టెక్నాలజీతో వీటిని నిర్మించనున్నారు. ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్స్, LED లైటింగ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. యూపీలోని సంస్కృతిని, చరిత్రని దృష్టిలో పెట్టుకుని అవి ప్రతిబింబించేలా ఈ ఎయిర్‌పోర్ట్ టర్మినల్స్‌ని నిర్మిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. 

Continues below advertisement

మాది చేతల ప్రభుత్వం : ప్రధాని మోదీ

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని అభివృద్ధి పనులను చూసి దేశ ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారని అన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల సీజన్‌లో హామీలు మాత్రమే ఇచ్చేదని, కానీ తమ ప్రభుత్వం మాత్రం చెప్పిన ప్రతి పనినీ పూర్తి చేస్తోందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు వచ్చి హడావుడి చేసే వైఖరి తమది కాదని తేల్చి చెప్పారు. 2019లో కొన్ని ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశామని, అది ఎన్నికల కోసం చేయలేదని వెల్లడించారు. అజంఘడ్ ప్రజలు తమపై చూపిస్తున్న ప్రేమని, గౌరవాన్ని దేశమంతా గమనిస్తోందని అన్నారు. ఇంతగా తమని విశ్వసిస్తుండడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. 

"కొద్ది రోజులుగా నేను దేశవ్యాప్తంగా పలు కీలకమైన అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తున్నాను. ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే స్టేషన్‌లు, IIM,AIIMS ఇలా ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఈ అభివృద్ధిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గత ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేసేందుకే హామీలు ఇచ్చేవి. ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం ఇచ్చిన హామీలనీ ఇప్పటి వరకూ నెరవేర్చలేదు. ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి ఆ తరవాత మాయం అవుతారు. కానీ ఇప్పుడు దేశ ప్రదలకు మోదీపై నమ్మకం పెరిగింది. 2019లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్‌లు ఏవీ ఎన్నికల స్టంట్ కాదు. ఇదంతా మేం చేసిన అభివృద్ధి ప్రచారమే. 2047 నాటికి భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నదే నా ఆకాంక్ష"

- ప్రధాని నరేంద్ర మోదీ

Continues below advertisement