PM Modi Award:
ఈజిప్ట్ పర్యటన..
ఈజిప్ట్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశం అత్యున్నత పురస్కారం అందించింది. అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తాహ్ ఎల్ సిసి (Abdel Fattah El-Sisi) Order of the Nile పురస్కారాన్ని మోదీకి అందజేశారు. ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. వీటిపై ఇద్దరూ సంతకాలు చేసిన తరవాత అబ్దేల్...మోదీకి శాలువా కప్పి ఈ అవార్డు ఇచ్చారు. అబ్దేల్‌ని కలిసే ముందు ప్రధాని మోదీ Al-Hakim మసీదుని సందర్శించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు నివాళులర్పించారు. అక్కడే అరగంట పాటు గడిపారు. ఈజిప్ట్‌కి చెందిన వాళ్లకే కాకుండా మానవతా దృక్పథంతో ఈజిప్ట్‌కి సాయం అందించే ఎవరికైనా ఈ ఆర్డర్ ఆఫ్ ది నైల్ అవార్డు ఇస్తారు. ఈ అవార్డు అందుకున్న వారికి ఈజిప్ట్‌లో గౌరవ వందనం లభిస్తుంది. ఈ అవార్డు దక్కడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు మోదీ. అక్కడి కీలక నేతలతో చర్చించిన ప్రధాని...భారతీయులతోనూ మాట్లాడారు. ఇదే క్రమంలో గ్రాండ్ మఫ్తీ ఆఫ్ ఈజిప్ట్ డాక్టర్ షాక్వీ ఇబ్రహీం అబ్దేల్ కరీమ్ అల్లమ్‌తోనూ భేటీ అయ్యారు. గత 9 ఏళ్లలో ప్రధాని మోదీకి దక్కిన 13వ అత్యున్నత పురస్కారం ఇది.