PM Modi Karnataka Visit:
కర్ణాటకలో పర్యటన..
ప్రధాని నరేంద్ర మోదీ స్పోర్ట్స్ డ్రెస్‌లో మెరిశారు. కర్ణాటకలోని చమరంజనగ్రలోని బందిపూర్ టైగర్ రిజర్వ్‌లో సఫారీ చేశారు. సాధారణంగా లాల్చీ కుర్తా, వాస్‌కోట్‌లో కనిపించే ప్రధాని...ఈ సారి పూర్తిగా వేషధారణ మార్చేశారు. ఖాకీ ప్యాంట్, బ్లాక్ హ్యాట్, ఆర్మీ కలర్ టీ షర్ట్ ధరించారు. ఈ సందర్భంగా పోస్టల్ స్టాంప్ విడుదల చేయనున్నారు. స్వయం సహాయక బృందాలతో ముచ్చటించనున్నారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న టైగర్ సెన్సస్‌నూ (పులుల సంఖ్య) అధికారికంగా విడుదల చేయనున్నారు. భారత్‌లో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మైసూరులో ప్రత్యేక కార్యక్రమంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రామ్‌లోనే టైగర్ సెన్సస్‌ను విడుదల చేస్తారు ప్రధాని. దీంతో పాటు "అమృత్ కాల్"లో భాగంగా...పులుల సంరక్షణకు సంబంధించి కేంద్రం తీసుకోనున్న చర్యలనూ ప్రస్తావించనున్నారు.
ఇదే కార్యక్రమంలో International Big Cats Alliance (IBCA) కార్యక్రమాన్నీ ప్రారంభించనున్నారు. నీలగిరిలోని ముదుమలై టైగర్ రిజర్వ్ రిజర్వ్‌నూ సందర్శించనున్నారు ప్రధాని. ఉత్తమ డాక్యుమెంటరీగా ఆస్కార్ సాధించిన The Elephant Whispers చిత్రంలో నటించిన నటీ నటులనూ కలవనున్నారు. ఈ క్రమంలోనే నీలగిరి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లోని హోటళ్లను తాత్కాలికంగా మూసేశారు. ఏనుగు సఫారీలపైనా ఆంక్షలు విధించారు. ప్రాజెక్ట్ టైగర్‌కు 50 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ఓ కాయిన్‌నూ విడుదల చేస్తారు ప్రధాని.