Election Results 2024: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరవాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల ముందుకొచ్చారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేసినందుకు ఈసీకి అభినందనలు తెలిపారు. బీజేపీకి ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారని ఆనందం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శం అని వెల్లడించారు. కశ్మీర్‌లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదవడం గొప్ప విషయమని కొనియాడారు. ఇది భారతీయులందరి విజయం అని తేల్చి చెప్పారు. గెలిచిన పార్టీలకు, అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతోందని వెల్లడించారు. జగన్నాథుడి ఆశీస్సులతోనే ఇది సాధ్యమైందని అన్నారు. కేరళలో తొలిసారి ఎంపీ సీటు గెలవడాన్నీ ప్రస్తావించారు ప్రధాని మోదీ.
Lok Sabha Election Results 2024: ఇది భారతీయులందరి విజయం, ఫలితాల తరవాత ప్రధాని మోదీ తొలి స్పీచ్
Ram Manohar | 04 Jun 2024 08:56 PM (IST)
Lok Sabha Election Results 2024: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరవాత ప్రధాని మోదీ తొలిసారి ప్రసంగించారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరవాత ప్రధాని మోదీ తొలిసారి ప్రసంగించారు.