Vikasit Bharat:  టీమ్ ఇండియాలా అందరూ కలిసి పనిచేసి 2047 నాటికి భారత్ ను వికసిత్ భారత్ గా చేయాలని నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన   నీతి ఆయోగ్   10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం   ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది.  'వికసిత రాజ్యం, వికసిత భారత్ @2047' అనే థీమ్‌తో ఈ సమావేశాన్ని నిర్వహించారు.   ఇది 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రాష్ట్రాల కీలక పాత్రను ఈ సమావేశంలో చర్చించారు.   

2047 నాటికి వికసిత భారత్ 

2047 నాటికి  రాష్ట్రాల స్థాయిలో అభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కేంద్రం , రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ అభిప్రాయపడింది.  కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 'టీమ్ ఇండియా'గా కలిసి పనిచేస్తే, ఏ లక్ష్యమైనా సాధ్యమని ప్రధానమంత్రి మోదీ  పిలుపునిచ్చారు.   రాష్ట్రాలు తమ స్థానిక బలాలు,  వాస్తవాలకు అనుగుణంగా దీర్ఘకాలి విజన్ డాక్యుమెంట్లను ను రూపొందించాలని సూచించారు.  MSMEలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయని గుర్తిస్తూ, గ్రామీణ నాన్-ఫార్మ్ ఉపాధి అవకాశాలు,  పట్టణ అనధికార రంగ సవాళ్లపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలకు సంబంధించిన MSME మద్దతు కార్యక్రమాలు , స్కీముల గురించి వివరించారు. 

గ్రీన్ ఎకానమీపై చర్చ 

భారతదేశం  సుస్థిర అభివృద్ధి  కోసం పునరుత్పాదక ఇంధనం,  సర్క్యులర్ ఎకానమీపై చర్చలు జరిగాయి. రాష్ట్రాలు తమ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలనుస  గ్రీన్ టెక్నాలజీల వృద్ధిపై తమ ప్రణాళికలు వివరించాయి.  అలాగే పర్యాటకంలో ప్రధానమంత్రి మోదీ ప్రతి రాష్ట్రం ఒక ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఇది ఆర్థిక వృద్ధిని , ఉపాధి అవకాశాలను పెంచుతుందన్నారు.   అభివృద్ధిలో వెనుకబడిన జిల్లాలను వేగవంతం చేయడం ,  కేంద్ర-రాష్ట్ర సంయుక్త పథకాల పురోగతిని కూడా ఈ సమావేశంలో చర్చించారు.  వ్యవసాయం, విద్య, ఆరోగ్యం,   ఉపాధి వంటి అంశాలపై అంశాలపై చర్చలు జరిగాయి 

సహకార సమాఖ్య విధానం

 కేంద్రం,  రాష్ట్రాలు టీమ్ ఇండియాగా కలిసి పనిచేయాలని, ఇది అభివృద్ధి వేగాన్ని పెంచడానికి అవసరమని ప్రధాని మోదీ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.  గత దశాబ్దంలో భారత ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకుందని, ఇప్పుడు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని ఆయన లక్ష్యం నిర్దేశించారు.  రాష్ట్రాలు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగరాలను అభివృద్ధి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. 

 చంద్రబాబు ప్రజెంటేషన్ 

ఏపీ  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'స్వర్ణాంధ్ర' లక్ష్యాన్ని సాధించడానికి నీతి ఆయోగ్ నుండి ప్రత్యేక సహాయం కోరారు, ప్రతి కుటుంబంలో ఒక AI ప్రొఫెషనల్, ఒక  పారిశ్రామికవేత్త సృష్టించాలనే లక్ష్యం పెట్టుకున్నామన్నారు.  తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రదర్శించారు . సమావేశం తర్వాత ప్రధానమంత్రితో  పలు అంశాలపై మాట్లాడారు.  

హాజరు కాని ముగ్గురు ముఖ్యమంత్రులు  సమావేశానికి బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. హాజరయ్యారు. బీజేపీయేతర ప్రభుత్వాల నుంచి  తమిళనాడు (ఎం.కె. స్టాలిన్), తెలంగాణ (రేవంత్ రెడ్డి), పంజాబ్ (భగవంత్ మాన్), జార్ఖండ్ (హేమంత్ సోరెన్), నాగాలాండ్ (కాన్రాడ్ సంగ్మా), అరుణాచల్ ప్రదేశ్ (పెమా ఖండూ)  హాజరయ్యారు. పుదుచ్చేరి, కర్ణాటక,   కేరళ ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. బిహార్ ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ కూడా హాజరు కాలేదు.  ఆయన స్థానంలో డిప్యూటీ సీఎంలు సమ్రాట్ చౌధరి ,విజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారు.