Election Results 2024: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ విజయం (PM Modi wins from Varanasi) సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌ రాయ్‌పై లక్షన్నర ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు మొదలైనప్పుడు మోదీ వెనకంజలో ఉండండ కాస్త టెన్షన్ పెట్టినా ఆ తరవాత లీడ్‌లోకి వచ్చారు. చివరకు మరోసారి వారణాసిని చేజిక్కించుకున్నారు. ఈ గెలుపుతో ఆయన హ్యాట్రిక్ కొట్టారు. మూడో స్థానంలో BSP అభ్యర్థి జమాల్ లరి ఉన్నారు. 1991 నుంచి బీజేపీ వారణాసిలో 9 సార్లు విజయం సాధించింది. మధ్యలో 2004లో కాంగ్రెస్ అభ్యర్థి RK మిశ్రా విజయం సాధించారు. అప్పుడు మినహా ఎప్పుడూ వారణాసి బీజేపీకి కంచుకోటగా ఉంది. అజయ్‌ రాయ్‌ మూడుసార్లు వారణాసిలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నిజానికి మొదట అజయ్ రాయ్‌ 6,223 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తరవాత మోదీ పుంజుకున్నారు. 5 లక్షల ఓట్ల మెజార్టీ రాగా అజయ్ రాయ్‌కి రాగా మోదీకి 6.12 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే...దేశవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం బీజేపీ జోరు తగ్గింది. ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేదు. 2014లో మోదీ వేవ్‌లో చాలా రాష్ట్రాలు క్లీన్‌స్వీప్ అయ్యాయి. కానీ ఈ సారి మహారాష్ట్ర, యూపీలో మాత్రం NDA వెనకబడింది. ఇండీ కూటమి గట్టి ప్రభావాన్ని చూపించింది. 2014 నుంచి యూపీలో బీజేపీ బలం పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వెనకబడిపోయింది.