Snakes in Pants: మియామి ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిబ్బందికి షాక్ ఇచ్చాడో ప్యాసింజర్. తన ప్యాంట్‌లో పాములు పెట్టుకుని వచ్చాడు. చాలా పకడ్బందీగా వాటిని ప్యాక్ చేసి ప్యాంట్‌లో పెట్టుకున్నాడు. అక్రమంగా వాటిని తరలించాలని చూశాడు. అనుమానం వచ్చిన భద్రతా సిబ్బంది చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. US Transportation Security Administration సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా ఈ సంగతంతా వెల్లడించింది. ఏప్రిల్ 26వ తేదీన ఈ ఘటన జరిగింది. మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ప్రయాణికుడిని గుర్తించి పాములను ప్యాంట్‌లో నుంచి బయటకు తీసినట్టు వివరించింది. ఈ పోస్ట్‌లో ఆ పాముల ఫొటోలనూ షేర్ చేసింది ఎయిర్‌పోర్ట్ సిబ్బంది. ఓ బ్యాగ్‌లో రెండు చిన్న పాముల్ని పెట్టి ప్యాక్ చేశాడు స్మగ్లర్. 

Continues below advertisement


"మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద భద్రతా సిబ్బంది ఓ ప్యాసింజర్ ప్యాంట్‌లో పాముల బ్యాగ్‌ని గుర్తించారు. చెక్‌పాయింట్ వద్ద ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు భద్రతా సిబ్బందికి సహకరించారు. ఆ పాములను ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ కమిషన్‌కి అందించాం"


- భద్రతా సిబ్బంది