Parvathi Reddy is the Chief Patron and Advisor for The Messi GOAT Tour:    ప్రపంచ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ భారతదేశంలోని నాలుగు నగరాల్లో జరిగే ‘జీ.ఓ.ఏ.టీ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఇండియా టూర్ 2025 లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది.  డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఈ మూడు రోజుల టూర్  కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలో జరుగనుంది. హైదరాబాద్ లెగ్‌లో మెస్సీతో పాటు అతని ఇంటర్ మియామీ సిఎఫ్ టీమ్‌లోని రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ కూడా పాల్గొంటారు. ఈ భారీ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో విజయవంతం చేయడానికి చీఫ్ ప్యాట్రాన్ , అడ్వైజర్‌గా పార్వతి రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. 

Continues below advertisement

ఫుట్‌బాల్ క్లినిక్,  లాజిస్టిక్స్, ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మీట్-అండ్-గ్రీట్ వంటి హై-ప్రొఫైల్ ఈవెంట్లను ఏర్పాటు చేస్తూ, మెస్సీ ఇంటర్నేషనల్ టీమ్‌తో సమన్వయం చేస్తున్నారు. పార్వతి రెడ్డి, హైదరాబాద్ లెగ్‌కు మొత్తం ఈవెంట్‌ను  డిజైన్ చేసిన ముఖ్యమైన వ్యక్తి.   ముఖ్యంగా ఫుట్‌బాల్ క్లినిక్‌పై దృష్టి సారించారు.    ప్రధానంగా మెస్సీ చేపట్టే ఫుట్‌బాల్ క్లినిక్‌పై దృష్టి సారించింది. రోడ్రిగో , లూయిస్ సువారెజ్ కూడా క్లినిక్‌లో పాల్గొంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా వారు పిల్లలకు శిక్షణ ఇస్తారు,  ప్రోత్సహిస్తారు.   ఫుట్‌బాల్ టిప్స్ ఇస్తారు. ఈ క్లినిక్‌లో అండర్‌ప్రివిలేజ్డ్ పిల్లలు కూడా పాల్గొంటారు, మెస్సీ యునిసెఫ్ యాంబాసిడర్‌గా ఉన్నారు.  ఈ ఈవెంట్ హైదరాబాద్‌ను ఫుట్‌బాల్‌ ప్రపంచంలో ప్రముఖంగా మార్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని పార్వతి రెడ్డి అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ పర్యటన డిసెంబర్ 13న మెస్సీ కోల్‌కతా నుంచి రావడంతో ప్రారంభమవుతుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం)లో జరిగే 7వీ7 ఎగ్జిబిషన్ మ్యాచ్ ముఖ్య ఆకర్షణ. ఈ మ్యాచ్‌లో మెస్సీ, డి పాల్, సువారెజ్‌లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి టీమ్‌తో పోటీపడతారు. మ్యాచ్ కేవలం 5-10 నిమిషాలు కొనసాగుతుంది, దీనిలో మెస్సీ తన నైపుణ్యాలు ప్రదర్శిస్తూ ‘టిక్ ట్యాక్ టో’  టికి తకా టెక్నిక్‌ను పిల్లలకు నేర్పుతారు. మ్యాచ్ తర్వాత థీమాటిక్ లేజర్ షో, డ్రోన్ షోలు, మ్యూజికల్ కాన్సర్ట్ జరుగనున్నాయి. కాన్సర్ట్‌లో కైడెన్ శర్మ, రాహుల్ సిప్పిల్‌జంగ్ వంటి టాప్ ఆర్టిస్టులు ప్రదర్శన ఇస్తారు.  హై-ప్రొఫైల్ మీట్-అండ్-గ్రీట్ ఈవెంట్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరుగుతుంది. ఇక్కడ మెస్సీతో సింగిల్ ఫోటో సెషన్ రూ. 9.95 లక్షలకు అందుబాటులో ఉంది, ఇందులో ఆర్జెంటీనా జెర్సీ, హై టీ సహా. నాలుగైదు వందల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.  పార్వతి రెడ్డి మెస్సీ ఇంటర్నేషనల్ టీమ్‌తో సమన్వయం చేసి, ఈ ఈవెంట్‌ను లోకల్ అరేంజ్‌మెంట్లు, పబ్లిసిటీతో ముందుకు తీసుకెళ్తున్నారు   పార్వతి రెడ్డి  NAR Infra Pvt Ltd కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.   ISB హైదరాబాద్ నుంచి ఫ్యామిలీ బిజినెస్ డిప్లొమా పొందారు. 2018లో NAR ఫౌండేషన్ ను స్థాపించారు. ఇది ఆర్ట్, మహిళలు-పిల్లల సాధికారత, పర్యావరణ బాధ్యతల రంగాల్లో ప్రచారాలకు మద్దతు ఇస్తుంది.  హైదరాబాద్ చాప్టర్ ఆఫ్ యంగ్ FICCI లేడీస్ ఆర్గనైజేషన్,  FICCI యంగ్ లీడర్స్ కోర్ కమిటీ సభ్యురాలు. బిజినెస్, లీడర్‌షిప్ రంగాల్లో సహకారం కోసం మహిళా శిరోమణి అవార్డు,  లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు అందుకున్నారు.  పార్వతి రెడ్డి వ్యాపారం, కళ, సామాజిక సేవలతో పాటు స్పోర్ట్స్ ప్రమోషన్‌లో కూడా చురుకుగా పాల్గొంటూ హైదరాబాద్‌కు గుర్తింపు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె చొరవ ద్వారా నగరం అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లకు ఆతిథ్యమిచ్చే స్థాయికి చేరుకుంటోంది. 

Continues below advertisement