Pakistani female MP: పాకిస్తాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్లమెంట్ ఎంపీలు ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకుంటున్నారు. తాజాగా మహిళా ఎంపీ జరీన్ రియాజ్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె పాకిస్తాన్ పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ఖ్వాజా ఆసిఫ్ చేతకాని తనాన్ని ప్రశ్నించారు. ప్రధానంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలు, ముఖ్యంగా పహల్గాం దాడి , "ఆపరేషన్ సింధూర్" సందర్భంలో పాకిస్తాన్ రక్షణ వైఫల్యాలపై ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.
జరీన్ రియాజ్ తన ప్రసంగంలో తీవ్రమైన స్వరంతో కఠిన సత్యాలు చెప్పారని సోషల్ మీడియాలో ప్రశంసలువస్తున్నాయి. పాకిస్తాన్ సైనిక సామర్థ్యం భారత్‌తో పోలిస్తే బలహీనంగా ఉందని, దీర్ఘకాల యుద్ధంలో పాకిస్తాన్‌కు విజయావకాశాలు తక్కువని ఆమె స్పష్టం చేశారు. పాకిస్తాన్ సైన్యం బలహీనతలు, ఆర్థిక అస్థిరత, మరియు బలూచిస్తాన్ వంటి అంతర్గత సమస్యలను ఆమె లేవనెత్తినట్లు తెలుస్తోంది. ఈ విషయాలు పాకిస్తాన్ పార్లమెంట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
విపక్ష పార్టీలకు చెందిన వారు పాకిస్తాన్ ప్రధానిని తప్పు పట్టడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. షహబాజ్ షరీఫ్.. మోదీపేరు ఎత్తడానికి భయపడుతున్నారని మండిపడుతున్నారు. పిరికి ప్రధాని అని విమర్శలు గుప్పిస్తున్నారు.
మాజీ సైనికాధికారి అయిన ఎంపీ.. పాకిస్తాన్ ను దేవడే కాపాడాలని కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.
ఓ వైపు ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేకపోతోంది. ఉగ్రవాదులకు మద్దతుగా లేమని కూడా చెప్పలేకపోతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ ప్రభుత్వ పరువు తీస్తున్నారు విపక్ష ఎంపీలు. సమాధానం చెప్పలేకపోతోంది అక్కడి ప్రభుత్వం.