Pakistan has once again launched drone attacks: పాకిస్తాన్ చీకటి పడగానే రెచ్చిపోతోంది. సరిహద్దుల నుంచి మరోసారి డ్రోన్ దాడులు చేసింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో ఈ డ్రోన్స్ ను భారత్ నిర్వీర్యం చేసింది. అయితే పలు ప్రాంతాల్లో పూర్తిగా బ్లాకౌట్ ప్రకటించారు. జమ్ములో భారీ పేలుళ్లు వినిపిస్తున్నాయని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో తెలిపారు. రూమర్స్ ను నమ్మవద్దని.. జమ్ములో ప్రస్తుతం  బ్లాకౌట్ ప్రకటించామని తెలిపారు.  

 పలు చోట్ల భారీ శబ్దాలు  వినిపిస్తున్నాయని.. బ్లాకౌట్ చేసిన ఫోటోను ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  

పటాన్ కోట్..సాంబా సెక్టార్లలోనూ డ్రోన్ దాడులకు పాకిస్తాన్ ప్రయత్నించింది. అయితే వాటిని గాల్లోనే భారత సైన్యం పేల్చేసింది.