Virat Kohli: విరాట్ కోహ్లీకి  దేశవ్యాప్తంగా రెస్టారెంట్స్ ఉన్నాయి. వాటి పేరు వన్ 8 కమ్యూన్. ఇటీవల హైదరాబాద్‌లో కూడా దీన్ని ప్రారంభించారు. విరాట్ కోహ్లీపై అభిమానమో లేకపోతే రెస్టారెంట్ లో తిండి బాగుంటుందని అనుకుంటారో కానీో ఈ రెస్టారెంట్లకు మంచి ఆదరణ ఉంటుంది. అయితే సహజంగానే రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా ఓ యువతి విరాట్ కోహ్లీ రెస్టారెంట్ కు వెళ్లింది. స్టార్టర్ గా.. భుట్టా అనే పదార్థాన్ని ఆర్డర్ చేసింది. భుట్టా అంటే.. నాలుగు కార్న్ ముక్కలు ఉడికించినవి. వాటి ఫోటో తీసి..తాను ఈ భుట్టా కోసం.. రూ. 525 రూపాయలు చెల్లించానని పోస్టు పెట్టారు.  

అమె పోస్టు చూసి భిన్నంగా స్పందిస్తున్నారు. ఇందులో ఎక్కువగా విరాట్ కోహ్లీకి మద్దతుగా పోస్టులు ఉన్నాయి. ఆ ధర పెట్టింది కేవలం ఆ ఒక్క పదార్థానికి కాదని.. మీరు అత్యంత సౌకర్యవంతమైన , లగ్జరీ ప్లేస్ లో కూర్చున్నాని మంచి లైవ్ మ్యూజిక్ సహా అనేక సౌకర్యాలు కల్పించారని అందులో అన్నీ కలిపి ఉంటాయని ఓ నెటిజన్ గుర్తు చేశారు. 

మరో  నెటిజన్.. ఏమీ తెలియకుండానే అక్కడకు వెళ్లి ఆర్డర్ చేశారా.. దాని రేటు అక్కడ అంతే ఉంటుందని తెలిసి కూడా ఆర్డర్ చేసి ఎందుకు ఇలా పోస్టు పెడుతున్నారని ప్రశ్నించారు. [ 

 

 

మరికొంత మంది సెలబ్రిటీలు తమ పేరును ఉపయోగించుకుని ఇలాంటి వాటి ద్వారా మరింత ఎక్కువగా సంపాదించుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. అయితే మరికొంత మంది కస్టమర్లు కూడా.. .వన్8 కమ్యూన్ రేట్లు పెట్టినంత హై స్టాండర్డ్ తో లేదని అంటున్నారు.