గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికిగానూ పలు రంగాల్లో సేవ చేసిన, రాణించిన మొత్తం 106 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రకటించింది. వీరిలో ఆరుగురికి పద్మ విభూషణ్, 9 మంది ప్రముఖులకు పద్మ భూషణ్ రాగా.. మరో 91 మంది ప్రముఖులను పద్మశ్రీ అవార్డులు వరించాయి. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కు, ఓఆర్ఎస్ సృష్టికర్త డాక్టర్ దిలీప్ మహాలనబీస్ కు, బాలక్రిష్ణ దోషికి మరణాంతరం వారికి దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ప్రకరించారు. జాకీర్ హుస్సేన్ (ఆర్ట్), ఎస్ఎం క్రిష్ణ (ప్రజా వ్యవహారాలు), శ్రీనివాస్ వర్ధన్ (యూఎస్ఏ)కు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పద్మవిభూషణ్ పురస్కారం దక్కించుకున్నారు.
తెలంగాణకు పద్మ పురస్కారాలు..
తెలుగు రాష్ట్రాలకు మొత్తం 12 పద్మ అవార్డులు దక్కాయి. ఇందులో 2 పద్మభూషణ్ కాగా, పది మంది ప్రముఖులను పద్మశ్రీ వరించింది. తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మభూషణ్ రాగా, ముగ్గురు ప్రముఖులను పద్మశ్రీ వరించింది. ఆధ్మాత్మికం విభాగంలో శ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, కమలేష్ డి పటేల్ లు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. మోదడుగు విజయ్ గుప్తకు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో, హనుమంతరావు పసుపులేటికి మెడిసిన్ విభాగంలో, బి రామక్రిష్ణారెడ్డికి లిటరేచర్, ఎడ్యుకేషన్ విభాగంలో పద్మశ్రీ అవార్డులు వరించాయి.
ఏపీ నుంచి ఏడుగురు ప్రముఖులకు పద్మశ్రీ..
నాటు నాటు పాటతో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంతో పాటు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణికి ఆర్ట్స్ విభాగం నుంచి పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్నారు. గణేష్ నాగప్ప క్రిష్ణరాజనగర కు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో, సీవీ రాజు ఆర్ట్, అబ్బారెడ్డికి నాగేశ్వరరావుకు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో, కోట సచ్చిదానంద శాస్త్రికి ఆర్ట్ విభాగం, చంద్రశేఖర్ కు సోషల్ వర్క్ విభాగంలో, ప్రకాష్ చంద్ర సూద్ కు విద్య, సాహిత్యం విభాగంలో పద్మ పురస్కారాలు వరించాయి.
గుజరాత్‌లోని సిద్ధి తెగల పిల్లల విద్య కోసం చేసిన కృషికి హీరా బాయి లోబీ పద్మశ్రీ అవార్డును పొందారు. జబల్పూర్‌కు చెందిన వార్ వెటరన్, 50 ఏళ్లుగా డాక్టర్ గా సేవలు అందించిన మునీశ్వర్ చందర్ దావర్. మత పరిరక్షణ మరియు రక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాగా సామాజిక కార్యకర్త రామ్‌కుయివాంగ్‌బే నుమే (సంస్కృతి) రంగంలో పద్మశ్రీ అవార్డును పొందారు.