Oscars 2023: 


ట్వీట్‌లో ప్రశంసలు.. 


ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమా పాటగానూ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ అరుదైన ఫీట్ సాదించిన RRR టీమ్‌కి రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ట్విటర్ వేదికగా వరుస ట్వీట్‌లతో అభినందిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ RRR టీమ్‌కి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఇండియన్ డాక్యుమెంటరీ 'The Elephant Whisperers'కి ఆస్కార్ రావడమూ గర్వంగా ఉందని అన్నారు. నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్ల పాటు నిలిచిపోతుందని ప్రశంసించారు. భారత్ గర్విస్తోంది అంటూ ట్వీట్ చేశారు. 


"అద్బుతం. నాటు నాటు పాటకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఈ పాట మరి కొన్నేళ్ల పాటు నిలిచిపోతుంది. సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్‌కు, చిత్ర బృందానికి అభినందనలు. భారత్‌ గర్విస్తోంది"


- ప్రధాని నరేంద్ర మోదీ






The Elephant Whisperers డాక్యుమెంటరీని కొనియాడారు ప్రధాని. ప్రకృతితో సహజీవనం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసిందంటూ కొనియాడారు. 


"The Elephant Whisperers టీమ్‌కు నా అభినందనలు. ప్రకృతితో మమేకమై జీవించడం ఎంత ముఖ్యమో ప్రపంచానికి చాటి చెప్పారు. "


- ప్రధాని నరేంద్ర మోదీ