Panic among the people of Pakistan: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్తాన్ ప్రజల్లో ఓ రకమైన పానిక్ ఏర్పడింది. బ్యాంకుల్లో డబ్బులు ఉంటే తర్వాత తీసుకోవడం కష్టమని అందరూ డ్రా చేసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లో షేర్లు అమ్మేస్తున్నారు. భారత్ ఉగ్ర క్యాంపులపై ఎటాక్ తర్వాత పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (PSX), కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ (KSE-100 ఇండెక్స్) భారీ నష్టాలను చవిచూసింది. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం పాకిస్తాన్ , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది,
మే 7, 2025న, కరాచీ స్టాక్ ఎక్సేంజ్ KSE-100 ఇండెక్స్ 6,272 పాయింట్లు సుమారు 5.5% నుండి 6 శాతం క్షీణించి, 107,296.64 స్థాయికి పడిపోయింది. ఇది మంగళవారం ముగింపు స్థాయి 113,568.51తో పోలిస్తే గణనీయమైన తగ్గిపోయింది. దాడులు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించాయి. ఇది ఇప్పటికే అస్థిర రాజకీయ పరిస్థితి, IMF రుణాలపై ఆధారపడటం వంటి కారణాలతో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారింది.
స్టాక్ మార్కెట్ క్రాష్ , భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల బ్యాంకులలో వద్దకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. తమ డబ్బుల్ని వెనక్కి తీసుకోవాలని ప్రజలు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. దాంతో పాకిస్తాన్ ప్రజలు డ్రా చేసే మొత్తంగా ఆంక్షలు విధించారు.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే IMF రుణంపై ఆధారపడి ఉంది. ఈ దాడుల తర్వాత యుద్ధం జరిగితే IMF , వరల్డ్ బ్యాంక్ నుండి సహాయం ఆగిపోయే అవకాశం ఉంది. మార్కెట్ క్రాష్ విదేశీ మారక రిజర్వులపై ఒత్తిడిని పెంచాయి, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ పై ప్రభావం చూపడంఖాయంకా కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2021 తర్వాత అతిపెద్ద రోజువారీ పతనాన్ని చవిచూసింది, KSE-100 ఇండెక్స్ 6% వరకు క్షీణించింది, ఇది పెట్టుబడిదారులలో తీవ్ర ఆందోళనను సూచిస్తుంది. బ్యాంకులపై నేరుగా దాడులు జరగకపోయినప్పటికీ, స్టాక్ మార్కెట్ క్రాష్, ఆర్థిక అస్థిరత, IMF సహాయం ఆగిపోవచ్చనే భయం బ్యాంకింగ్ సెక్టార్‌పై ఒత్తిడిని పెంచాయి.