Coromandel Express Accident: 



288 మంది మృతి 


ఒడిశా ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్యపై స్పష్టత లేకపోవడం కన్‌ఫ్యూజన్‌కి దారి తీసింది. 288 మంది చనిపోయారని చాలా మంది ధ్రువీకరించారు. అయితే...అధికారులు మరణాల సంఖ్యలో క్లారిటీ ఇచ్చారు. డెత్‌ టోల్‌ని అప్‌డేట్ చేసి...275 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. అందరూ అనుకుంటున్నట్టుగా 288 మంది చనిపోలేదని వివరించారు. ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జేనా ఇదే విషయం తెలిపారు. కొన్ని మృతదేహాలను రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్ తలెత్తిందని స్పష్టం చేశారు. 


"ఈ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. అందరూ అనుకుంటున్నట్టుగా మృతుల సంఖ్య 288 కాదు. అధికారులతో మరోసారి చెక్‌ చేయించాం. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కపెట్టారు. అందుకే సంఖ్య పెరిగింది. కానీ...వాస్తవంగా మృతుల సంఖ్య 275. వీరిలో 88 మంది ఐడెంటిటీని గుర్తించాం"


- ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జేన్ 






మార్చురీలో ఉన్న డెడ్‌ బాడీస్‌కి DNA టెస్ట్‌లు కూడా చేస్తున్నట్టు ప్రదీప్ జేన్ వెల్లడించారు. స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో ఈ టెస్ట్‌లు జరుగుతున్నాయని వివరించారు. మొత్తం 1,175 మంది గాయపడ్డారని చెప్పిన ఆయన..వారిలో 793 మంది డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. ఇప్పటికే కొన్ని డెడ్‌బాడీస్ ఐడెంటిటీని గుర్తించి వాళ్ల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇంకా గుర్తించాల్సిన డెడ్‌బాడీస్‌ చాలానే ఉన్నాయి.