Govt Official Throws Cash Worth Rs 2 Cr During Vigilance Raid: భువనేశ్వర్‌లో అదో అపార్టుమెంట్. అటుగా వెళ్తున్న వారికి పై నుంచి డబ్బులు పడటం కనిపించింది. అంతే ఏరుకోవడం ప్రారంభించారు. డబ్బుల వర్షం పడుతోందన్న ప్రచారం ప్రారంభమయింది. అక్కడేం జరిగిందో తర్వతాతెలిసి ఆశ్చర్యపోయారు. ఒడిశా విజిలెన్స్ డిపార్ట్‌మెంట్, రూరల్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో చీఫ్ ఇంజనీర్ )గా పనిచేస్తున్న బైకుంఠ నాథ్ సారంగీ ఇంటిపై దాడులు చేశారు. అవినీతి ఆరోపణలు రావడంతో.. అక్రమ ఆస్తులు బాగా వెనకేశారని ఫిర్యాదులు రావడంతో ఈ సోదాలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో, సారంగీ తన భువనేశ్వర్‌లోని ఫ్లాట్ కిటికీ నుండి రూ. 500 నోట్ల బండిల్స్‌ను విసిరాడు.
ఇలా విసిరేసిన వాటిని దొరికిన వారు పట్టుకునిపోయారు. కొంత మంమది వద్ద నుంచి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో మొత్తం రూ. 2.1 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భువనేశ్వర్‌లో రూ. 1 కోటి , అంగుల్‌లో రూ. 1.1 కోట్లు ఉన్నాయి. స్వాధీనం చేసిన నగదులో ఎక్కువగా రూ. 500 నోట్లు ఉన్నాయి, అలాగే రూ. 200, రూ. 100, మరియు రూ. 50 నోట్లు కూడా ఉన్నాయి.
అంగుల్‌లోని స్పెషల్ జడ్జ్, విజిలెన్స్ జారీ చేసిన సెర్చ్ వారెంట్ల ఆధారంగా ఈ దాడులు ఏకకాలంలో ఏడు ప్రదేశాలలో జరిగాయి. అంగుల్‌లోని కరడగడియాలో ఒక రెండు అంతస్తుల ఇల్లు, భువనేశ్వర్‌లోని డుండుమాలో ఒక ఫ్లాట్, పూరీ జిల్లాలోని సియులా (పిపిలి)లో మరొక ఫ్లాట్, సారంగీ పూర్వీకుల ఇల్లు, యు అంగుల్‌లోని బంధువుల ఇళ్లు. భువనేశ్వర్‌లోని చీఫ్ ఇంజనీర్, RD ప్లానింగ్ అండ్ రోడ్ డివిజన్‌లోని సారంగీ ఆఫీస్ ఛాంబర్ లలో సోదాలు చేశారు.
సారంగీ తన ఆదాయ వనరులకు మించి ఆస్తులను సంపాదించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సారంగీ కిటికీ నుండి నగదు బండిల్స్ విసిరిన దృశ్యం వీడియోలో రికార్డ్ అయింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను "నగదు వర్షం"గా వర్ణించారు.