Nirmala Sitharaman: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సమయంలో.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒమాబా పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. తనదైన శైలిలో స్పందించి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోదీ మీడియా సమావేశానికి ముందు బరాక్ ఒబామా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ప్రధాని మోదీతో భేటీలో పాల్గొంటే, భారత్ లో ముస్లింల హక్కుల గురించి ప్రస్తావిస్తానని, వారి హక్కులను పరిరక్షించకపోతే భారత్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కునే అవకాశం ఉందని వివరించారు. అయితే ఈ ఒబామా చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా ఆరు ముస్లిం మెజారిటీ దేశాలపై బాంబు దాడి చేసిందని చెప్పారు. 






బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సిరియా, యెమెన్, ఇరాక్ ఇలా కనీసం ఆరు ముస్లిం మెజారిటీ దేశాలపై బాంబు దాడి జరిగిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. 26, 000 బాంబులు ప్రయోగించిన ఇలాంటి ఓ వ్యక్తి చేస్తున్న ఆరోపణలను ప్రజలను ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఈ దేశంలో అభద్రతా భావం ఉందని.. ప్రజలు భయపడే వాతావరణాన్ని ప్రతిపక్షాలు సృష్టిస్తున్నారని చెప్పారు. యునైటెడ్ స్టేట్స్‌ లో విలేకరుల సమావేశంలో ప్రదమైన ప్రధానమంత్రి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' సూత్రంపై పని చేస్తుందని చాలా చక్కగా వివరించినట్లు గుర్తు చేశారు. ఏ కమ్యూనిటీ పట్ల వివక్ష చూపదని వివరించారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీకీ మొత్తం 13 అవార్డులు లభించాయని.. అందులో ఆరు కంటే ఎకకువగా ముస్లిం దేశాల నుంచి వచ్చినవేనని గుర్తు చేశారు. 






నిర్మలా సీతారామన్ కు ముందు.. బీజేపీకి చెందిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ఒబామా వ్యాఖ్యలను ఖండించారు. భారత దేశంలోని అనేక మంది "హుస్సేన్ ఒబామా" పట్ల అతని రాష్ట్ర పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్నారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial