New Zealand's New Year 2024: న్యూజిలాండ్‌లోని ఆక్‌లాండ్‌ (Auckland New Year 2024) ప్రజలు కొత్త సంవత్సరానికి అందరి కన్నా ముందుగా వెల్‌కమ్ చెప్పారు. భారీ ఎత్తున బాణసంచా పేల్చి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేజర్‌, ఫైర్‌వర్స్క్ షో అందరినీ ఆకట్టుకుంది. ఎప్పటిలాగే ఆక్‌లాండ్‌లోని SkyCityలో ఈ వేడుకలు జరిగాయి. Sky Tower పై పది సెకన్ల కౌంట్‌డౌన్ పెట్టి జీరో రాగానే క్రాకర్స్ కాల్చి న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవడం ఇక్కడ ఓ అలవాటు. దాదాపు 5 నిముషాల పాటు క్రాకర్స్‌ కాల్చి చాలా గ్రాండ్‌గా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు కివీస్‌ ప్రజలు. 


 






ప్రపంచంలోనే అన్ని దేశాల కన్నా ముందుగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతుంది పసిఫిక్ ద్వీప దేశం Kiribati. న్యూజిలాండ్‌ కన్నా ముందే అక్కడ వేడుకలు మొదలయ్యాయి. దీన్నే Christmas Islandగానూ పిలుస్తారు. కిరిబటి తరవాత ఆక్‌లాండ్, న్యూజిలాండ్‌లో వేడుకలు జరుగుతాయి.


అటు ఆస్ట్రేలియాలోనూ దాదాపు న్యూ ఇయర్ కౌంట్‌డౌన్ ముగిసింది. కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్‌ ప్రాంతంలో క్రాకర్స్ పేల్చి ( fireworks in Sydney) ఘనంగా కొత్త ఏడాది 2024కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆశలు చిగురించేలా లేజర్‌ షోలు ఏర్పాటు చేశారు. ఏటా కొత్త సంవత్సరం సందర్భంగా సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద బాణసంచా కాల్చి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది.






ఆస్ట్రేలియాలో భారత్ కన్నా అయిదున్నర గంటల ముందు కొత్త సంవత్సరం మొదలవుతుంది. మన కంటే మూడున్నర గంటల ముందే జపాన్ ప్రజలు న్యూ ఇయర్ 2024 లోకి అడుగుపెడతారు. దక్షిణ కొరియా, ఉత్తరకొరియా సైతం దాదాపుగా జపాన్ సమయంలోనే నూతన సంవత్సర వేడుకలు మొదలుపెడతాయి. భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ తరువాత భారత్ లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటాం. 


చివరగా ఎక్కడంటే..
చివరగా న్యూ ఇయర్ జరుపుకునే దేశాల్లో భారత్ తరువాత కొన్ని ప్రాంతాలున్నాయి. భారత్ అనంతరం అయిదున్నర గంటలకు ఇంగ్లాండ్ కొత్త ఏడాదిని ఆహ్వానించనుంది. మన తరువాత దాదాపు 10.30 గంటలకు అమెరికాలోని న్యూయార్క్‌ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. అమెరికా పరిధిలోని బేకర్‌, హోవార్డ్‌ దీవులు చివరగా కొత్త ఏడాదిని స్వాగతిస్తాయి. కానీ అక్కడ జనాలు లేకపోవడంతో  అమెరికన్‌ సమోవాలో చివరగా కొత్త సంవత్సరం ఆరంభమయ్యే ప్రాంతంగా భావిస్తారు. 
Also Read: వచ్చే ఏడాది కూడా లేఆఫ్‌లు ఉంటాయా? జాబ్ మార్కెట్‌ని AI తొక్కేయనుందా?