Rs 75 Coin:
రూ.75 కాయిన్ విడుదల..
ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పక్కా షెడ్యూల్ ప్రకారం ఈ తంతు జరగనుంది. ఇదే కార్యక్రమంలో ప్రధాని మోదీ రూ.75 కాయిన్‌ని విడుదల చేయనున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ కాయిన్‌ని విడుదల చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ అధికారికంగా వెల్లడించింది. ప్రత్యేక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ కాయిన్ వివరాలనూ వెల్లడించింది. 44 మిల్లీమీటర్ల డయామీటర్‌తో ఉంటుందని తెలిపింది. ఈ కాయిన్‌ని 50% వెండి, 40% రాగి, 5%నికెల్, 5% జింక్‌తో తయారు చేశారు.
"కాయిన్‌పై అశోక పిల్లర్‌తో పాటు దానిపై పులి బొమ్మ ఉంటుంది. దాని కింద సత్యమేవ జయతే అనే నినాదం రాసి ఉంటుంది. ఎడమ వైపున "Bharat" అని మెన్షన్ చేశాం. ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది. కుడివైపు ఇంగ్లీష్‌లో "INDIA" అని కనిపిస్తుంది. మరో వైపు పార్లమెంటరీ కాంప్లెక్స్ బొమ్మ ప్రింట్ అయ్యుంటుంది. పార్లమెంటరీ కాంప్లెక్స్ స్క్రిప్ట్‌పై సన్సన్ సంకుల్ అని రాసి ఉంటుంది."
- నోటిఫికేషన్