అన్వేషించండి

Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 

Airforce Station in Adilabad: ఆదిలాబాద్ లో రక్షణ శాఖ భారీ ప్లాన్ చేస్తోంది. అక్కడ ఎయిర్‌పోర్ట్‌ మాత్రమే కాదు, AIRFORCE Station రాబోతోంది. వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంపై కేంద్రం దృష్టి సారించింది.

Airforce Station in Adilabad:   ఆదిలాబాద్ జిల్లాపై కేంద్రం రక్షణశాఖ దృష్టి పెట్టింది.   ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. అయితే ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌ మాత్రమే కాదు.. రక్షణశాఖకు చెందిన AIRFORCE Station రాబోతోంది. తెలంగాణ సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కేంద్రం నిర్ణయించింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ తప్ప మరెక్కడా విమానాశ్రయాలు లేవు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఎయిర్‌పోర్టులు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయాలని సివిల్ ఏవియేషన్, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించాయి.ఆదిలాబాద్‌లో ఎప్పటి నుంచో రక్షణశాఖ ఆధ్వర్యంలో ఉన్న 369 ఎకరాల భూమికి మరో 4౩0 ఎకరాలు జతచేస్తూ కిందటేడాది నవంబర్‌లో జీవో కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు కేవలం ఎయిర్‌పోర్ట్ మాత్రమే కాకుండా దానికి అనుబంధంగా ఓ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్ నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిని ఓకే చేయడంతో ఇప్పుడు మరింత భూమిని సేకరించనున్నారు. మొత్తం 1500ఎకరాలు అవసరం అవుతుందని భావిస్తున్నారు. 

ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం

ఆదిలాబాద్‌లో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు చేసే ప్రక్రియ ఊపందుకుంది. శనివారం ఎయిర్ ఫోర్స్ కెప్టెన్లు జేపీ సభర్వాల్. హెచ్.కే హెగ్దే, వింగ్ కమాండర్ రాజీవ్ నేతృత్వంలో పదిమంది రక్షణ, వాయు, విమాన సాధికారసంస్థ అధికారుల బృందం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇన్చార్జి కలెక్టర్ యువరాజ్ మర్మాట్లతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేసారు.

1500 ఎకరాలు కావాలి

ఆదిలాబాద్ ను అనుకోని ఉన్న అక్కడి అనుకుంట, బంగారుగూడ సమీపంలో రెండు వాగులు, ఆ ప్రాంతం మీదుగానే వెళ్లే హైటెన్షన్ విద్యుత్ తీగలను కూడా అధికారుల బృందం పరిశీలించింది వాటిని తొలగించటమా.. అలాగే ఉంచటమా అనే విషయం అదికారుల బృందం స్పష్టంగా వెల్లడించనప్పటికీ ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో దీన్ని ప్రస్తావించే అవకాశం ఉందనీ, అదనంగా భూసేకరణ కోసం అధికార యంత్రాంగం నిషానీ ఘాట్, అంకోలి, తంతోలి శివారుతోపాటు మూతపడిన ప్రభుత్వ సిమెంటు పరిశ్రమ(సీసీఐ) భూములను సైతం అధికారుల బృందం పరిశీలించింది. ఇందులో ఏ ప్రాంతం అనుకూలమనేది కీలకంగా మారింది. ఇప్పటివరకైతే కాలనీలు, నిర్మాణాలు తొలగించకుండానే 430.30 ఎకరాలు సేకరించేలా జిల్లా యంత్రాంగం సర్వే చేసి, ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పుడు ఈ భూములతో పాటు అదనంగా మరో 800 సేకరించాల్సి ఉన్నందున ఏ ప్రాంతం అనుకూలమనేది తెరమీదకు వస్తోంది. CCI భూములు  ప్రభుత్వానికే బదలాయింపు చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన కూడా ఉంది.

పూర్తిస్థాయి ఎయిర్‌ఫోర్స్ స్టేషన్

ఆదిలాబాద్‌ రక్షణపరంగా వ్యూహాత్మక ప్రాంతంగా గుర్తించే రక్షణశాఖ చాలా కాలం క్రితం అక్కడ భూములు తీసుకుంది. దక్షణ- ఉత్తర భారతాలను కలిపే జంక్షన్‌లో ఉండటం.. తీర ప్రాంతానికి దూరంగా అటవీ ప్రాంతాల మధ్య ఉండటం వల్ల ఆదిలాబాద్‌కు ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్‌లోని బేగంపేట్, హకీంపేట్ ఎయిర్‌స్టేషన్లతో పాటు.. దుండిగల్ ట్రైనింగ్ అకాడమి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సూర్యలంక బీచ్‌ వద్ద ఓ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఉంది. రక్షణపరంగా అవసరమైన కొన్ని యుద్ధవిమానాలను ఇక్కడ మొహరిస్తారు.  ఆదిలాబాద్‌ కు సివిల్ విమానాలు తక్కువుగానే వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కువ శాతం రక్షణశాఖనే ఈ రన్‌వేను ఉపయోగిస్తుంది. ఎయిర్‌ఫోర్స్ యూనిట్ వస్తుంది ఓ టౌన్ షిప్, ట్రైనింగ్ సెంటర్ వంటివి వస్తాయి. కాబట్టి మరో 800 ఎకరాలు కావాలంటున్నారు. మొత్తం మీద దాదాపు 1500 ఎకరాలు కావలసివస్తోంది. 

ఆదిలాబాద్‌లో విమానాశ్రయ నిర్మాణ పనులను ఎయిర్‌పోర్ట్ అథారిటీ చేపడుతుంది. అయితే ఆపరేషన్స్ రక్షణ శాఖ నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం వైజాగ్ ఎయిర్‌పోర్ట్ అలాగే పనిచేస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TVK Vijay Risk: దినదినగండం ..నూరేళ్ల ఆయుష్షు -విజయ్ సర్కార్‌కు ఇదే పరిస్థితి - హీరో నెట్టుకురాగలరా?
దినదినగండం ..నూరేళ్ల ఆయుష్షు -విజయ్ సర్కార్‌కు ఇదే పరిస్థితి - హీరో నెట్టుకురాగలరా?
ABP Desam Top 10, 9 May 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 9 May 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Axar Patel News: అక్షర్ పటేల్ బ్యాటింగ్ వైఫల్యం.. ఐపీఎల్ చరిత్రలో సెకండ్ లోయెస్ట్ యావరేజ్ కెప్టెన్ గా రికార్డు! 
అక్షర్ పటేల్ బ్యాటింగ్ వైఫల్యం.. ఐపీఎల్ చరిత్రలో సెకండ్ లోయెస్ట్ యావరేజ్ కెప్టెన్ గా రికార్డు! 
Aliens Latest News: గ్రహాంతరవాసులు ఉన్నారా? ఏలియన్ ఫైల్స్ విడుదల చేసిన ట్రంప్ ప్రభుత్వం.. సినీ నిర్మాతకు అనుమానాలు
గ్రహాంతరవాసులు ఉన్నారా? ఏలియన్ ఫైల్స్ విడుదల చేసిన ట్రంప్ ప్రభుత్వం.. సినీ నిర్మాతకు అనుమానాలు
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: డిజిటల్ వార్‌కు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - జగనన్న టెక్ ఫోర్స్ రెడీ - ఏపీలో పొలిటికల్ వార్ అంతా ఆన్‌లైన్లోనే!
డిజిటల్ వార్‌కు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - జగనన్న టెక్ ఫోర్స్ రెడీ - ఏపీలో పొలిటికల్ వార్ అంతా ఆన్‌లైన్లోనే!
IPL 2026 DC VS KKR Result Update: డీసీ ఔట్..! కేకేఆర్ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. అజేయ సెంచ‌రీతో అలెన్ స‌త్తా, కేకేఆర్ కు వ‌రుస‌గా నాలుగో విజ‌యం..
డీసీ ఔట్..! కేకేఆర్ చేతిలో ఘోర ప‌రాజ‌యం.. అజేయ సెంచ‌రీతో అలెన్ స‌త్తా, కేకేఆర్ కు వ‌రుస‌గా నాలుగో విజ‌యం
Tamil Politics Twist: విజయ్‌కు ఇంకా 2 సీట్ల లోటే - శనివారం ప్రమాణ స్వీకారం డౌటే - లోక్‌భవన్ కీలక ప్రకటన
విజయ్‌కు ఇంకా 2 సీట్ల లోటే - శనివారం ప్రమాణ స్వీకారం డౌటే - లోక్‌భవన్ కీలక ప్రకటన
Collectors meeting second day: ఆగస్టు 15న రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు - కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
ఆగస్టు 15న రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు - కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
Bengal CM Suvendu Adhikari: బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి - శనివారమే ప్రమాణం
బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి - శనివారమే ప్రమాణం
Car Buying Tips: సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఈ మిస్టేక్ చేయవద్దు.. లేకపోతే నష్టపోతారు
సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఈ మిస్టేక్ చేయవద్దు.. లేకపోతే నష్టపోతారు
Lanka to India: శ్రీలంక నుంచి ఈదుకుంటూ ఇండియాకొచ్చేశారు - బెంగళూరు జంట రికార్డ్
శ్రీలంక నుంచి ఈదుకుంటూ ఇండియాకొచ్చేశారు - బెంగళూరు జంట రికార్డ్
Kodangal Revanth Reddy: కొడంగల్‌ను బంగారు తునకగా మార్చుకుందాం - ప్రజలకు రేవంత్ పిలుపు
కొడంగల్‌ను బంగారు తునకగా మార్చుకుందాం - ప్రజలకు రేవంత్ పిలుపు
Embed widget