Watermelon after Biryani Tragedy: ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు బిర్యానీ తర్వాత పుచ్చకాయ తినడం వల్ల చనిపోయారు. కుటుంబంలో నలుగురు  12 గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆహ్లాదకరంగా సాగిన ఒక విందు భోజనం.. ఒక కుటుంబం మొత్తాన్ని చిదిమేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నప్పటికీ, మరణానికి గల అసలు కారణాలపై ఇప్పుడు వైద్య నిపుణులు ,పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

Continues below advertisement

 విందు భోజనం.. విషాదాంతం 

ముంబైలోని పైధోని ప్రాంతానికి చెందిన అబ్దుల్లా అబ్దుల్ కాదర్  , తన భార్య నస్రీన్  , కుమార్తెలు అయేషా (16), జైనాబ్  లతో కలిసి శనివారం రాత్రి బంధువులతో కలిసి విందులో పాల్గొన్నారు. అందరూ కలిసి రాత్రి 10:30 గంటల సమయంలో ఎంతో ఇష్టంగా బిర్యానీ తిన్నారు. ఆ సమయంలో ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ, ఇంటికి వచ్చిన తర్వాత అర్ధరాత్రి ఒక గంట సమయంలో పుచ్చకాయను డెజర్ట్‌గా తీసుకున్నారు. అక్కడి నుండే ఆ కుటుంబానికి మృత్యువు ముంచుకొచ్చింది.

Continues below advertisement

 12 గంటల్లోనే ప్రాణాలు గాలిలో.. 

పుచ్చకాయ తిన్న కొన్ని గంటలకే, అంటే తెల్లవారుజామున 5 గంటల నుండి కుటుంబ సభ్యులందరికీ తీవ్రమైన వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. స్థానిక డాక్టర్ వద్దకు వెళ్లినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో వారిని జేజే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చిన్న కుమార్తె జైనాబ్ మరణించగా, ఆమె వెంటే తల్లి నస్రీన్, అక్క అయేషా ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 10:30 గంటల సమయంలో తండ్రి అబ్దుల్లా కూడా కన్నుమూశాడు. 

పుచ్చకాయే కారణమా? 

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారు తిన్న పుచ్చకాయ ముక్కలను స్వాధీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలకు పంపారు. సాధారణంగా పుచ్చకాయ తింటే ప్రాణాలు పోవు, కానీ అందులో ఏదైనా బాహ్య విషపదార్థాలు  కలిశాయా లేదా రంగు కోసం ఏదైనా హానికరమైన రసాయనాలు వాడారా అనే కోణంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేస్తోంది. బిర్యానీ తిన్న తర్వాత వెంటనే పుచ్చకాయ తినడం వల్ల ఏదైనా రసాయనిక చర్య జరిగిందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.   

 వైద్య పరీక్షల నివేదికపై ఉత్కంఠ 

జేజే ఆసుపత్రి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించి బాడీ శాంపిల్స్ ,  విసెరా రిపోర్టులను ఫోరెన్సిక్ విభాగానికి పంపారు. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ ఉందా లేక ఇతర విషతుల్య పదార్థాల ప్రభావమా అన్నది తేల్చడానికి మైక్రోబయాలజీ మరియు హిస్టోపాథాలజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నివేదికలు వస్తే తప్ప ముంబైని కుదిపేసిన ఈ మిస్టరీ మరణాల వెనుక ఉన్న అసలు కారణం బయటపడదు. ప్రస్తుతానికి ఈ ఘటన అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.