MLA Mustapha: మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండడంతో ప్రజాప్రతినిధులతో పాటు ప్రతిపక్ష నేతలు ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఈక్రమంలోనే అభివృద్ధి చేసిన నేతలకు ఆదరణ లభిస్తుండగా.. ఏమీ పట్టించుకోని నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా పాత గుంటూరులో.. గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాకు నిరసన సెగ తగిలింది. బ్రహ్మంగారి గుడి వీధిలో మురుకాల్వ శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే ముస్తఫాను స్థానికులు అడ్డుకున్నారు. తమ ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ కావాలని స్థానికుల డిమాండ్ చేశారు. కాలువ నిర్మాణంతో రహదారులు మరింత తగ్గిపోతాయని ఆందోళన చేశారు. పనులు అడ్డుకున్న స్థానికుల పై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. ప్రజలు ఎమ్మెల్యే నాశనం అయిపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. ఈ విషయం సంచలనంగా మారింది. 


ఇటీవలే మేయర్ తో ఎమ్మెల్యే గొడవ - తెరదించిన అధికార యంత్రాంగం


గుంటూరులో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యేగా అన్నట్లుగా సాగుతున్న రాజకీయాలకు హైకమాండ్ తెరదించిది. ఇద్దరు నేతలు తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని మీడియా ముందు చెప్పాలని ఆదేశించడంతో ఈ పని చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక  టీడీపీ నాయకులు మా పై అభాండాలు వేస్తున్నారని.. మా మధ్య గొడవలు లేవన్నారు.  మాకు పార్డీ ముఖ్యం...వ్యక్తిగత  ప్రయోజనాలు కోసం పార్టీని వాడుకోం.. పార్టీ సింబల్ ఫ్యాన్ రెక్కల‌ క్రిందే మేము ఉంటాం అంటూ స్ట్రాంగ్ కౌంటర్  ఇచ్చారు  ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ మనోహర్ నాయుడు    


మేయర్ తీరుపై ఎమ్మెల్యే వర్గం కార్పొరేటర్ల వ్యతిరేకత
 
గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ మనోహర్ కు , గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్థఫాకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మేయర్ తమకు సరైన ప్రాధాన్యతనివ్వటం లేదని  పదమూడు మంది కార్పొరేటర్లు మునిసిపల్ ట్రావెలర్ బంగ్లాలో సమావేశమయ్యారు. గత కొంతకాలంగా సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్లే అసంత్రప్తిని వ్యక్తం చేస్తున్నారు.  ఎన్నికల సమయంలో మేయర్ పదవిని కాపు సామాజిక వర్గానికి చెందిన కావటి మనోహర్ నాయుడికి ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. అయితే గుంటూరు తూర్పు పరిధిలోకి వచ్చే కార్పోరేటర్ రమేష్ గాంధీకి పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే ముస్తఫా పట్టుపట్టారు. కానీ మనోహర్ నాయుడికే పదవి దక్కింది. అప్పటి నుండి ఇరువురికీ పొసగడం లేదు.  


మేయర్ ను మార్చే ప్రయత్నంలో ఎమ్మెల్యే ముస్తఫా


మేయర్ పదవి నుంచి మనోహర్ నాయుడును తొలగించేందుకు   ఎంఎల్ఏ  ముస్తఫా ప్రయత్నం చేస్తున్నాడరని అని కావటి వర్గం భావిస్తోంది.  ఎంఎల్ఏ ప్రమేయం లేకుండా సొంత నిర్ణయాలతో పనులు కొనసాగిస్తూ ముస్తఫాను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఎంఎల్ఏ వర్గం అనుమానిస్తోంది. ఈ క్రమంో కార్పొరేటర్లు సమావేశం పెట్టుకోవడం వైసీపీలో సంచలనం రేపింది.  సొంత పార్టీలో‌ కార్పోరేటర్ల  కుమ్ములాట..మేయర్ వర్సెస్ ఎంఎల్ఏ అంటూ సోషల్ మీడియాలో కథనాలు హోరెత్తించాయి.  ఈ వార్తలపై ఎవ్వరూ స్పందించక పోవడంతో కథనాలకు మరింత బలం చేకూరింది.  పార్టీ పరువు బజారున పడటంతో‌ నష్ట నివారణ చర్యలను హైకమాండ్ చేపట్టింది.