ABP  WhatsApp

MCD Election Results 2022: చరిత్ర సృష్టించిన ఆప్ అభ్యర్థి- MCD సభ్యురాలిగా తొలిసారి ట్రాన్స్‌జెండర్‌!

ABP Desam Updated at: 07 Dec 2022 02:30 PM (IST)
Edited By: Murali Krishna

MCD Election Results 2022: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ నిలబెట్టిన ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి బోబి విజయం సాధించారు.

(Image Source: ANI)

NEXT PREV

MCD Election Results 2022: 15 ఏళ్ల భారతీయ జనతా పార్టీ జైత్రయాత్రకు బ్రేకులు వేస్తూ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో పాటు ఓ ఆప్ అభ్యర్థి అరుదైన రికార్డ్ నెలకొల్పారు.


తొలిసారి


సుల్తాన్‌పురి-ఏ వార్డులో ఆప్‌ తరపున పోటీ చేసిన బోబి విజయం సాధించారు. దీంతో తొలిసారి ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎంసీడీ సభ్యురాలిగా ఎన్నికైనట్లయింది. తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి వరుణ్ థాకాపై బోబి 6714 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ విజయం పట్ల బోబి హర్షం వ్యక్తం చేశారు.





నా కోసం కష్టపడి పనిచేసిన ప్రజలకు నా గెలుపును అంకితం చేయాలనుకుంటున్నాను. నేను అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. ఇప్పుడు నేను నా ప్రాంతంలో అభివృద్ధికి కృషి చేయాలి.  -                                                    బోబి, ఆప్‌ అభ్యర్థి

Published at: 07 Dec 2022 02:30 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.