Baba Neem Karoli:


జుకర్ సక్సెస్ సీక్రెట్ ఇదే..


మార్క్ జుకర్ బర్గ్. సోషల్ మీడియాలో ఈ పేరు ఓ సంచలనం. ఫేస్‌బుక్‌తో మొదలైన ఆయన ప్రయాణం...ఇప్పుడు మెటా వరకూ వచ్చింది. ఈ సక్సెస్‌కి కారణమేంటని అడిగితే "కమిట్‌మెంట్, కృషి, టెక్నలాజికల్ విజన్" ఇలా ఎన్నో సమాధానాలు వినిపిస్తాయి. వీటితో పాటు ఎంతో కొంత లక్ కూడా ఉంటుందని ఇంకొందరు చెబుతారు. ఇవన్నీ నిజమే కావచ్చు. కానీ...జుకర్ సక్సెస్ సీక్రెట్ మరోటి ఉంది. ఇన్నాళ్లూ ఆ రహస్యం..రహస్యంగానే ఉండిపోయింది. ఈ మధ్యే అందరికీ తెలిసిపోయింది. స్వయంగా జుకర్‌బర్గ్ ఓ మీటింగ్‌లో ఓ ఆసక్తికర విషయం చెప్పారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ జుకర్‌బర్గ్‌ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వాళ్లిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఆ మాటల సందర్భంలోనే జుకర్ బర్గ్ ప్రధాని మోదీకి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఇంతకీ జుకర్ ఏం చెప్పాడో తెలుసా..? భారత్‌లోని ఓ ఆలయం గురించి. అవును. ఉత్తరాఖండ్‌ కొండలపై ఉన్న ఓ ఆలయానికి వెళ్లాకే తన జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయని మోదీకి చెప్పాడు జుకర్. ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ స్టేజ్‌పైనే ఈ ఆసక్తికర కథని చెప్పారు. అదేంటంటే..


"2004లో ఫేస్‌బుక్‌ని మొదలు పెట్టాను. తొలి రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. ఏం  చేయాలో తోచలేదు. బై అవుట్ బిడ్స్ కూడా వచ్చాయ్. కంపెనీ పూర్తిగా డల్ అయిపోయింది. చాలా మంది ఫేస్‌బుక్‌ని కొనేందుకు ముందుకొచ్చారు. కానీ నాకు మాత్రం అది ఇష్టం లేదు. చాలా రోజులు ఆలోచించి యాపిల్‌ ఫౌండర్ స్టీవ్ జాబ్స్‌ని కలిశాను. అప్పుడే నాకు ఆయన ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఇండియాలోని ఓ టెంపుల్‌కి వెళ్లాలని సలహా ఇచ్చారు. యాపిల్‌ని స్థాపించే ముందుకు తాను కూడా అక్కడికే వెళ్లినట్టు వివరించారు."


- మార్క్ జుకర్ బర్గ్, మెటా ఫౌండర్ 


బాబా నీమ్ కరోలి..


అలా స్టీవ్ జాబ్స్ సలహాతో భారత్‌లోని ఉత్తరాఖండ్‌లో ఉన్న ఆలయానికి వెళ్లాడు జుకర్ బర్గ్. అయితే...ఆ ఆలయం ఏంటి అన్న వివరాలు మాత్రం కచ్చితంగా చెప్పలేదు. కానీ...ఇండియాలో పర్యటించిన తరవాతే తనకు మానసిక ప్రశాంతత లభించిందని, విజనరీ పూర్తిగా మారిపోయిందని వెల్లడించాడు జుకర్. ఆ తరవాత ఫేస్‌బుక్‌ కోట్లాది మందికి చేరువైందని చెప్పాడు. ఇక్కడే స్టీవ్ జాబ్స్ కథ గురించి కూడా కాస్త తెలుసుకుందాం. యాపిల్‌ని స్థాపించే ముందు స్టీవ్ జాబ్స్ (Steve Jobs) కూడా ఇలానే హరే కృష్ణ ఆలయానికి తరచూ వెళ్లి వచ్చే వాడు. ప్రతి ఆదివారం 7 మైళ్లు నడిచి మరీ ఆ ఆలయానికి చేరుకునే వారు. అక్కడ అందించే ఉచిత భోజనాన్నే తినేవారు. మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్ బిల్‌గేట్స్‌కి కూడా "ఆలయానికి వెళ్లండి" అని సలహా ఇచ్చారట జాబ్స్. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో కంచి ఆశ్రమానికి వెళ్లేవారని తెలుస్తోంది. కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే..ఆ ఆశ్రమంలోనే బాబా నీమ్ కరోలి (Baba Neem Karoli) ఉండే వారు. ఆయనను కలిసి ఆశీర్వాదం తీసుకోవాలని ఎంత ప్రయత్నించినా అది కుదరలేదు. అయినా...ఆ ఆశ్రమానికి తరచూ వస్తూ వెళ్తుండటం వల్ల ఓ పాజిటివ్ ఎనర్జీ వచ్చిందని, అదే యాపిల్‌ని స్థాపించేలా స్టీవ్ జాబ్స్ చెప్పేవారు. ఇప్పుడు మెటా అధినేత జుకర్‌బర్గ్ కూడా అదే ఆశ్రమానికి వెళ్లి ఉంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆ బాబా దయ వల్ల వీళ్లు బిలియనీర్లు అయిపోయారన్నమాట! 


Also Read: Mukesh Ambani: మరోమారు తాతయిన ముకేష్‌ అంబానీ, వారసురాలికి జన్మనిచ్చిన ఆకాశ్‌-శ్లోక