TVK party leader Vijay: తమిళ సూపర్‌స్టార్, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు దళపతి నివాసంలోకి ఓ వ్యక్తి చొరబడటం కలకలం రేపుతోంది. చెన్నై నీలంకరై ప్రాంతంలోనిలో ఉన్న విజయ్ ఇంట్లోకి ఆగంతుకుడు ప్రవేశించి, టెర్రస్‌పై తిరుగుతుండగా భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఇంటి చుట్టూ తనిఖీలు చేపట్టింది. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు నిర్ధారించారు. విజయ్‌కు వై-కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ, ఈ భద్రతా లోపం రాజకీయ, సినిమా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. నీలంకరై పోలీసుల ప్రకారం, 24 ఏళ్ల అరుణ్ అనే యువకుడు మడురాంతకం అనే ఊరి నుంచి చెన్నైలో ఉన్న తన బంధువుల వద్దకు వచ్చాడు. తర్వాత హఠాత్తుగా కనిపించలేదు. ఎక్కడికో వెళ్లి ఉంటారని బంధువులు కూడా పట్టించుకోలేదు.కానీ అరుణ్ రెండు రోజుల ముందే విజయ్ ఇంటి వద్ద ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రెండు రోజుల పాటు ఏం చేశాడో కానీ శుక్రవారం విజయ్ నివాసం టెర్రస్‌పైకి చేరుకున్నాడు. చెట్టుపైన రెండు రోజుల పాటు ఉన్నట్లుగా ఎవరికీ తెలియలేదు. విజయ్ టెర్రస్‌కు వెళ్లినప్పుడు అరుణ్ టెర్రస్‌పై ఉన్నట్లుగ ాగుర్తించాడు. వెంటనే విజయ్ అతన్ని కిందికి తీసుకువచ్చి, భద్రతా సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. భద్రతా సిబ్బంది అరుణ్‌ను అదుపులోకి తీసుకుని, నీలంకరై పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రాథమిక విచారణ చేసిన తర్వాత, అరుణ్‌కు చాలా కాలం నుంచి మనసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు తేలింది. ప్రస్తుతం అతడిని కీల్పాక్ మెంటల్ హెల్త్ హాస్పిటల్‌లో చేర్చారు.
ఈ ఘటన తర్వాత, పోలీసులు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను పిలిచి విజయ్ నివాసం చుట్టూ పూర్తి తనిఖీలు చేపట్టారు. ఏవైనా సస్పిష్టమైన వస్తువులు లేదా ప్రమాదకర పదార్థాలు లేవని నిర్ధారించుకున్నారు. వై-కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ విజయ్ ఇంట్లోకి ఆగంతుడు ఎలా ప్రవేశించాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి చుట్టూ హోమ్ గార్డ్స్, CRPF సిబ్బంది ఉండటంతో ఎలా వచ్చాడన్నదానిపై విచారణ జరుపుతున్నారు. విజయ్ ఇక రాజకీయ జీవితంపై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. తన తదుపరి సినిమా 'జన నాయక్' తర్వాత పూర్తిగా రాజకీయ ప్రచారం ప్రారంభించనున్నారు.