UP Man Bites Shopkeeper's Finger: యూపీలో వింత ఘటన జరిగింది. షాప్ యజమానికి వేలు కొరికేశాడు ఓ కస్టమర్. రూ.50 విషయంలో వాగ్వాదం తలెత్తగా కోపంతో షాప్ ఓనర్ వేలు కొరికాడు. యూపీలోని బందా జిల్లాలో జరిగిందీ ఘటన. బట్టల షాప్‌కి ఓ ఫ్రాక్ కొనేందుకు వచ్చిన కస్టమర్ గౌను కనుక్కుని వెళ్లిపోయాడు. మరుసటి రోజు మళ్లీ ఆ షాప్‌కి వెళ్లాడు. సైజ్ సరిపోలేదని, కాస్త పెద్ద ఫ్రాక్ ఇవ్వాలని అడిగాడు. పెద్ద సైజ్ ఫ్రాక్‌కి మరో రూ.50 అదనంగా చెల్లించాలని ఓనర్ అడిగాడు. అందుకు కస్టమర్ ఒప్పుకోలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాదన జరిగింది. చాలా సేపు వాదులాడుకున్న తరవాత ఆ ఓనర్ వేలు కొరికాడు కస్టమర్. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న అతని కొడుకు వేలునీ కొరికేశాడు. ఆ తరవాత ఆ ఫ్రాక్‌ని షాప్‌లో నుంచి రోడ్డుమీద పారేశాడు. వెళ్లే ముందు ఆ ఓనర్‌ని బెదిరించాడు. బాధితుడు వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Man Bites Off Finger: రూ.50 కోసం గొడవ, షాప్ ఓనర్ వేలు కొరికి పారేసిన కస్టమర్
Ram Manohar
Updated at:
14 Apr 2024 03:01 PM (IST)
Man Bites Finger: రూ. 50 కోసం జరిగిన గొడవలో యూపీలో ఓ కస్టమర్ షాప్ ఓనర్ వేలు కొరికి పారిపోయాడు.
రూ. 50 కోసం జరిగిన గొడవలో యూపీలో ఓ కస్టమర్ షాప్ ఓనర్ వేలు కొరికి పారిపోయాడు.
NEXT
PREV
Published at:
14 Apr 2024 03:01 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -