Home Ministry Office Security Breach: కేంద్రహోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలోకి ఓ యువకుడు అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించడం కలకలం సృష్టించింది. పార్లమెంట్‌లోని నార్త్ బ్లాక్‌లో హోంశాఖ ఆఫీస్‌లోకి ఫేక్ ఐడీ కార్డుతో ఓ యువకుడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చొరబాటు వెనకాల ఎలాంటి ఉగ్రకోణం లేదని ప్రస్తుతానికి పోలీసులు వెల్లడించారు. నిందితుడి పేరు ఆదిత్య ప్రతాప్ సింగ్‌గా గుర్తించారు. స్పెషల్ పోలీస్ సెల్‌తో పాటు మిగతా దర్యాప్తు సంస్థలూ ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నాయి. ప్రతాప్ సింగ్ నీతి ఆయోగ్‌లో స్టెనోగ్రాఫర్‌గా పని చేస్తున్నట్టు విచారణలో గుర్తించారు.
పార్లమెంట్లో మరోసారి కలకలం, ఫేక్ ఐడీతో హోంశాఖ ఆఫీస్‌లోకి యువకుడి చొరబాటు
Ram Manohar
Updated at:
07 Feb 2024 01:58 PM (IST)
Home Ministry Office: నకిలీ ఐడీతో హోంశాఖ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నకిలీ ఐడీతో హోంశాఖ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
NEXT
PREV
Published at:
07 Feb 2024 12:05 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -