సమాజంలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ.. జీతమే కాకుండా.. మరింత ఎక్కువ డబ్బులు పొందాలనే ఆశతో కొంత మంది ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారు. వారి స్థాయికి అనుగుణంగా ప్రజల నుంచి లంచం రూపంలో దోచుకుంటున్నారు. తాజాగా లంచం డిమాండ్ చేస్తున్నారంటూ ఓ బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పథంకం వేసి.. లంచం తీసుకుంటున్న అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది.
నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ ఎస్సై లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.... ఆనంతపేట్ గ్రామానికి చెందిన సల్కం సతీష్ కు ఇటీవలే ఇంకొక వ్యక్తి తో గొడవ పడ్డాడు. ఈ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. దీంతో మామడ ఎస్సై రాజు సతీష్ పై 323, 341, 291 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో రిమాండ్ చేస్తానంటూ చెప్పడంతో, పది వేl రూపాయిలు ఇస్తే స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్ఐ బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని సతీష్ ఏసీబీ కి సమాచారం ఇవ్వడంతో ఇవాళ ఎస్సై రాజుకి 10 వేలు ఇస్తుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ఇటీవల కొన్ని ఘటనలు...
గతంలో ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లంచం కేసులో పట్టుబడ్డ ఎస్సై కూర్చునే సీటుపైనే సీసీ కెమెరా ఉంది. అది మరచిన ఆయన.. ఎదురుగా ఉన్న ప్రింటర్‌లో డబ్బు పెట్టాలని బాధితుడికి చెప్పాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ కేసులో హెడ్ కానిస్టేబుల్ డబ్బులు తీసుకుని ఎస్సైకి ఇచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. డీల్ కుదుర్చుకున్న మొత్తంలో మొదటి విడత డబ్బును.. సీజ్ చేసి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచిన ఆటోలో ఉంచాలని ఎస్సై ఆదేశించాడు. ఆటోలో ఉంచిన లంచం డబ్బులను హెడ్ కానిస్టేబుల్ తీసుకెళ్లి ఎస్సైకి ఇచ్చాడు. రెండో విడత లంచం డబ్బులు తీసుకున్న సమయంలో ఎస్సై స్టేషన్‌లో లేకపోవడంతో హెడ్ కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కాడు. బేగంపేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై ముందు రూ.2 వేలు, ఆ తర్వాత మిగతా మొత్తం లంచంగా తీసుకున్నది సీసీ కెమెరాలో రికార్డు అయింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో లంచం డబ్బులు టోపీ కింద పెట్టాలని ఎస్సై బాధితుడికి సూచించారు. వ్యవహారం మొత్తం కెమెరాలో రికార్డు అయింది.
బహదూర్ పుర ఎస్ఐ శ్రావణ్ కుమార్ లంచం తీసుకుంటూ ఇటీవల ఏసీబీకి చిక్కారు. గత నెల 17వ తేదీన మహమ్మద్ ముజీబ్ అనే వ్యక్తి కుమారుడు అతిక్ మొబైల్ తిరిగి ఇవ్వడానికి ఎస్సై శ్రావణ్ కుమార్ లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో ఎస్సై శ్రావణ్ కుమార్నుం అతీక్ దగ్గర చి డబ్బులు తీసుకుంటున్నదా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.