అన్వేషించండి

Maleesha Kharwa Success Story: ధారవి స్లమ్ ప్రిన్సెస్ .. గ్లోబల్ బ్యూటీ ఐకాన్ - నలుపు అని నవ్వినోళ్లే నోరెళ్లబెడుతున్నారు!

Mumbai Slum Girl Model: ముంబైలోని ధారవి మురికివాడకు చెందిన మలీషా ఖర్వా నేడు అంతర్జాతీయ బ్యూటీ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్. రంగు, పేదరికం వెక్కిరించినా ఆమె సాధించిన విజయం ఆందర్నీ ఆకర్షిస్తోంది.

Dharavi slum princess to international fashion model: కలలు కనడానికి ఆకాశమే హద్దు.. ఆ కలలను నిజం చేసుకోవడానికి పేదరికం అడ్డుకాదని నిరూపించింది 18 ఏళ్ల మలీషా ఖర్వా. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవి వీధుల్లో పెరిగిన ఈ అమ్మాయి, నేడు అంతర్జాతీయ ఫ్యాషన్ మ్యాగజైన్ల కవర్ పేజీలపై మెరుస్తోంది. లోకమంతా  నలుపు అని వెక్కిరించినా, తన ఆత్మవిశ్వాసంతో అందం యొక్క నిర్వచనాన్నే మార్చేసింది ఈ  స్లమ్ ప్రిన్సెస్ .

 చిన్న గుడిసెలో.. పెద్ద కలలు! 

మలీషా 2008 జనవరి 13న ధారవిలో జన్మించింది. ఆమె తండ్రి ముఖేష్ ఖర్వా పిల్లల పార్టీలలో జోకర్‌గా వేషాలు వేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఒక చిన్న ఇరుకైన గదిలో, ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగిన మలీషా.. ప్రియాంక చోప్రా వంటి స్టార్లను చూసి తాను కూడా ఒకరోజు మోడల్ కావాలని కలలు కనేది. అయితే, చుట్టుపక్కల వారు మాత్రం ఆమెను  నువ్వు చాలా నల్లగా ఉన్నావు, నీకు మోడలింగ్ ఎందుకు  అంటూ నిరుత్సాహపరిచేవారు. కానీ, ఆమె తన కలపై నమ్మకాన్ని వదులుకోలేదు.

 ఒక్క సంఘటన.. మలీషా జీవితాన్నే మార్చేసింది! 

2020లో హాలీవుడ్ నటుడు, నిర్మాత  రాబర్ట్ హాఫ్‌మన్  ముంబై పర్యటనకు వచ్చినప్పుడు మలీషాను చూశారు. ఆమెలోని కెమెరా ప్రెజెన్స్, ఆత్మవిశ్వాసం చూసి ఆశ్చర్యపోయిన ఆయన, ఆమె కథను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత మలీషా వెనుదిరిగి చూడలేదు. లగ్జరీ స్కిన్‌కేర్ బ్రాండ్  ఫారెస్ట్ ఎస్సెన్షియల్స్  తన  క్యాంపెయిన్ కోసం మలీషాను ఎంపిక చేసుకోవడం ఆమె కెరీర్‌లో అతిపెద్ద మలుపు.   

 అంతర్జాతీయ వేదికలపై ధారవి గళం 

ఒక్కసారిగా మలీషా క్రేజ్ పెరిగిపోయింది. కాస్మోపాలిటన్ ఇండియా, వోగ్, ఎల్లే, గ్రేజియా వంటి ప్రతిష్టాత్మక ఫ్యాషన్ మ్యాగజైన్లలో ఆమె మెరిసింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న మలీషా.. తాను మురికివాడలో పుట్టానని చెప్పడానికి ఎప్పుడూ వెనుకాడదు. తన నేపథ్యాన్ని గర్వంగా చెప్పుకుంటూ, తనలాంటి ఎంతోమంది యువతులకు  సెల్ఫ్ లవ్ గురించి సందేశాలిస్తోంది.

 సౌందర్య సూత్రాలకు సవాల్ 

మలీషా విజయం కేవలం గ్లామర్ ప్రపంచానికి మాత్రమే పరిమితం కాలేదు. భారతదేశంలో చర్మం రంగును బట్టి అందాన్ని కొలిచే పాత ఆలోచనా విధానాలను ఆమె సవాలు చేస్తోంది. మోడలింగ్‌తో పాటు సమాజానికి ఏదైనా చేయాలనే తపనతో  హోప్ అండ్ లవ్  థీమ్‌తో ఒక జ్యువెలరీ లైన్‌ను కూడా ఆమె ప్రారంభిస్తోంది. మురికివాడలో పుట్టినందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు.. నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను అని మలీషా చెప్పే మాటలు నేడు కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి. పట్టుదల ఉంటే ధారవి గల్లీల నుండి గ్లోబల్ క్యాంపెయిన్స్ వరకు ప్రయాణించవచ్చని ఆమె నిరూపించింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు, డీఎస్సీ-2025పై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్!
నేడు వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు, డీఎస్సీ-2025పై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్!
TMC Congress Merger: కాంగ్రెస్‌లో తృణమూల్ విలీనం కాదు .. మమతా బెనర్జీ చేరిక మాత్రమే - రెబల్స్ అసలు పార్టీని స్వాధీనం చేసుకుంటారా?
కాంగ్రెస్‌లో తృణమూల్ విలీనం కాదు .. మమతా బెనర్జీ చేరిక మాత్రమే - రెబల్స్ అసలు పార్టీని స్వాధీనం చేసుకుంటారా?
US Military Attack: పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
Rains in Andhra Pradesh and Telangana: ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran Deal: ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది, త్వరలోనే సంతకాలు చేసుకుంటాం: Donald Trump
Telangana Congress Internal Conflicts: తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
తెలంగాణ కాంగ్రెస్‌లో పెరిగిపోతున్న వర్గ పోరాటం - పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై ఆడియో లీకులు - చక్కదిద్దేదెవరు?
Vijay Deverakonda: విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
విజయ్ దేవరకొండను నాగ్ అశ్విన్ వదల్లేదుగా... లేటెస్ట్ 'సింగ్ గీతం'లోనూ
US Military Attack: పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
పరిస్థితి బాగోలేదని నా భర్త ముందే చెప్పాడు, లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే.. చీఫ్ ఇంజనీర్ భార్య భార్గవి
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
Rohit Sharma, Virat Kohli: రోహిత్, విరాట్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా.. టీమిండియా సీనియర్ల ఫ్యూచర్‌పై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!
రోహిత్, విరాట్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా.. సీనియర్ల ఫ్యూచర్‌పై అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!
Embed widget