Delhi Airport Security Breach: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వద్ద ఓ వ్యక్తి కాసేపు అలజడి సృష్టించాడు. ఎయిర్‌పోర్ట్ చుట్టూ ఉన్న గోడ దూకి రన్‌వే వైపు దూసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అదుపులోకి తీసుకుంది. నిత్యం ఎంతో బిజీగా ఉండే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఇలా భద్రతా వైఫల్యం తలెత్తడం సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. రిపబ్లిక్ డే వేడుకల నుంచి ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్‌పోర్ట్ భద్రతను చూసుకోవాల్సిన బాధ్యత Central Industrial Security Force (CISF) సిబ్బందిదే. అయితే...ఈ భద్రతా వైఫల్యంపై CISF తీవ్రంగా స్పందించింది. ఓ హెడ్ కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈ వేటు వేసింది. గోడ దూకి రన్‌వే వైపు పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 27న రాత్రి 11.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ పైలట్ ఆ వ్యక్తిని గుర్తించి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాడు. Air Traffic Control వెంటనే భద్రతా బలగాలకు సమాచారం అందించింది. వాళ్లు ఆ నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. హరియాణాకి చెందిన ఈ వ్యక్తిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అసలు ఈ భద్రతా వైఫల్యం ఎలా తలెత్తిందన్న కోణంలో విచారణ మొదలు పెట్టారు. అసలే ఢిల్లీలో వాతావరణం అనుకూలంగా లేదు. అంతా పొగమంచు కమ్ముకుంది. ఇలాంటి పరిస్థితులను అదనుగా తీసుకుని కొందరు అల్లర్లు, దాడులు చేసే ప్రమాదముందని ముందుగానే భద్రతా బలగాలు ఢిల్లీలో పహారా కాస్తున్నాయి. ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా...ఓ వ్యక్తి గోడ దూకి లోపలకి ఎలా వచ్చాడన్నదే అంతుపట్టకుండా ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా వైఫల్యం, గోడ దూకి రన్‌వే వైపు దూసుకొచ్చిన వ్యక్తి
Ram Manohar
Updated at:
29 Jan 2024 11:41 AM (IST)
Security Breach: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీ భద్రతా వైఫల్యం సంచలనం సృష్టించింది.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీ భద్రతా వైఫల్యం సంచలనం సృష్టించింది. (Image Credits: PTI)
NEXT
PREV
Published at:
29 Jan 2024 11:37 AM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -