Guinness Record: ఎంత ఉన్నామని కాదు అన్నయ్యా..! గిన్నిస్ బుక్ రికార్డులకెక్కిన 3 అడుగుల బుల్లెట్!

Advertisement
ABP Desam Updated at: 17 Sep 2021 05:17 PM (IST)
Edited By: Murali Krishna

మహారాష్ట్రకు చెందిన ప్రతీక్ విట్టల్ అనే 25 ఏళ్ల కుర్రాడు గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

గిన్నిస్ బుక్ రికార్డులకెక్కిన 3 అడుగుల బుల్లెట్!

NEXT PREV

ప్రతీక్ విట్టల్ మోహితే.. 3.3 అడుగులు ఉండే ఈ మహారాష్ట్ర కుర్రాడు ఏకంగా గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లోకెక్కాడు. 2022 ఎడిషన్‌కు సంబంధించి విట్టల్.. ప్రపంచలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్‌గా రికార్డు సృష్టించాడు. గిన్నిస్ వెబ్‌సైట్ ప్రకారం.. విట్టల్ 2012లో బాడీబిల్డింగ్ మొదలుపెట్టాడు. 

Continues below advertisement


ఎగతాళిని ఎదుర్కొని..


102 సెమీ (3 అడుగుల నాలుగు ఇంచులు) మాత్రమే ఉండటంతో చాలా మంది విట్టల్‌ను ఎగతాళి చేసేవారు. అలా ఎగతాళి చేసినవాళ్లే శభాష్ అనేలా మారాలని అనుకున్నాడు విట్టల్. బాడీబిల్డింగ్ చేద్దామనుకున్నాడు. కానీ జిమ్ పరికరాలు పెద్దగా ఉండటం వల్ల పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు విట్టల్. అది చూసి చాలా మంది నవ్వేవారు. కానీ ఏది ఏమైనా సరే అనుకున్నది సాధించాడు. గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌ను అందుకున్నాడు.







ప్రతీక్ విట్టల్‌కు విజయం అంత సులువుగా దక్కలేదు. అతని కృషి, పట్టుదల.. నేటి యువతకు ఆదర్శం. అతని కథ వింటే ఎవరైనా ఏదైనా సాధించొచ్చు అనే నమ్మకం కలుగుతోంది.                                        -     గిన్నిస్


 గత మూడేళ్లలో మొత్తం 41 పోటీల్లో విట్టల్ పాల్గొన్నాడు. కొన్ని ఈవెంట్లకు అతిథిగా వెళ్లాడు. తనని ఒకప్పుడు ఎగతాళి చేసినవారే ఇప్పుడు తనను మర్యాదగా ఆహ్వానిస్తున్నారని విట్టల్ అంటున్నాడు.


మిగిలిన గిన్నిస్ వీరులు..






2022 ఎడిషన్‌లో ఇతర విభాగాల్లో గిన్నిస్ రికార్డులు సాధించిన వాళ్ల వివరాలను సంస్థ వెల్లడించింది. ప్రపంచలోనే అత్యంత పొడవైన బాడీబిల్డర్‌గా నెదర్లాండ్స్‌కు చెందిన ఓలివర్ రిచ్‌టర్స్ నిలిచాడు. ఆయన ఎత్తు 218.3 సెమీ (7.1 అడుగులు).


మహిళల్లో అత్యంత పొడవైన బాడీబిల్డర్‌గా మరియా వాట్టెల్ (నెదర్లాండ్స్) రికార్డుల్లోకెక్కింది. ఆమె ఎత్తు 182.7 సెమీ (5.9 అడుగులు)

Published at: 17 Sep 2021 05:10 PM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.