Weather Today : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం ఇవాళ సాయంత్రానికి మరింత వాయుగుండంగా మారనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. బుధవారం నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం (Andhra Pradesh Weather)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 15 వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇవాళ అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.
బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో (ముఖ్యంగా చిత్తూరు,తిరుపతి,అన్నమయ్య) జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలి.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Also Read: విద్యార్థులకు గుడ్ న్యూస్, వరుసగా మూడురోజులపాటు సెలవులు - ఏయే తేదీల్లో అంటే?
తెలంగాణలో వాతావరణం (weather in Telangana)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా పడింది. ఇక్కడ చలి చాలా వరకు తగ్గుముఖం పట్టింది. వాతావరణ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం రేపటి వరకు వర్షాల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో తేలికపాటి తుంపర్లు, చిరుజల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 12వ తేదీ నుంచి వాతావరణం నార్మల్ అవుతుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. అప్పటి నుంచి చలి తీవ్రత పెరిగుతుందని అంటున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్‌లో వాతావరణం(Weather In Hyderabad)
హైదరాబాద్‌లో మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళలో పొగమంచు జనాలను వాహనదారులను ఇబ్బంది పెడుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు ఉంటే కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల వరకు రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. సోమవారం నమోదు అయిన గరిష్ట ఉష్ణోగ్రత 29.4, కనిష్ట ఉష్ణోగ్రత 21.5 డిగ్రీలు.
Also Read: మీ ట్రైన్ జర్నీ డేట్ మారిందా?, - టిక్కెట్ క్యాన్సిల్ చేయకుండా ప్రయాణ తేదీని మార్చొచ్చు
హైదరాబాద్‌లో ప్రమాదకరంగా గాలి కాలుష్యం
హైదరాబాద్‌లో మరోసారి కాలుష్యం పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం Air Quality Index చూస్తే హైదరాబాద్‌లో 168 పాయింట్లు చూపిస్తోంది. గత వారం రోజులుగా మోడరేట్‌గా ఉన్న హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇవాళ మరింత దారుణంగా పడిపోయింది. ఇది వచ్చే మూడు నాలుగు రోజులు నార్మల్‌గా ఉంటుందని మరోసారి శనివారం పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. AQI 50 పాయింట్ల లోపు ఉంటే ఆరోగ్యకరమైనదిగా నిర్దారిస్తారు. 100 పాయింట్లు దాటినప్పటి నుంచి అనారోగ్యకరమైన వాతావరణంగా గుర్తిస్తారు. 150 దాటిందంటే ప్రమాదకరమైన వాతావరణంగా చెబుతారు. ఇది 200 వందలు దాటితే తీవ్రస్థాయి కాలుష్యంగా చెబుతారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో వంద పాయింట్లకుపైగానే AQI నమోదు అవుతోంది.