Elon Musk Twitter Account Hacked:


హిందీ, భోజ్‌పురిలో ట్వీట్‌లు..


ట్విటర్ సీఈవో ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. ఉన్నట్టుండి ఆయన అకౌంట్‌లో ట్వీట్‌లన్నీ హిందీలో కనిపించాయి. హిందీతో పాటు భోజ్‌పురి భాషలోనూ ట్వీట్‌లు కనిపించటం నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. అవన్నీ ఫన్నీగా ఉండటం వల్ల వేలాది మంది రీట్వీట్ చేశారు. ఫలితంగా...ఈ అకౌంట్ అందరికీ రీచ్ అయిపోయింది. వేల మంది ఫాలో అయ్యారు కూడా. వెంటనే గుర్తించిన ట్విటర్ ఈ అకౌంట్‌ను సస్పెండ్ చేసింది. అప్పటికే ఈ అకౌంట్‌కు  97.2 వేల ఫాలోవర్లు వచ్చారు. ఎలన్ మస్క్ పేరిట ఎన్నో ట్వీట్‌లు దర్శనమిచ్చాయి. ప్రతి ట్వీట్...ప్రస్తుతం ట్విటర్‌లో జరుగుతున్న పరిణామాలపైనే ఉండటం వల్ల అందరూ కనెక్ట్ అయిపోయారు. నిజానికి...చాలా వరకూ న్యూస్ ఛానల్స్ కూడా కన్‌ఫ్యూజ్ అయ్యాయి. ఇది నిజంగా ఎలన్ మస్క్ ట్విటర్ అకౌంటేనా అని ఆశ్చర్యపోయాయి. అయితే...ఈ అకౌంట్ సస్పెండ్ అయిన తరవాత తేలిందేంటంటే...@iawoolford అనే ట్విటర్ యూజర్...అకౌంట్ పేరుని Elon Musk అని మార్చుకున్నాడు. ఇంత కన్‌ఫ్యూజన్‌ కేవలం ఈ యూజర్ వల్లే. అంతేకాదు. ఒరిజినల్ మస్క్ అకౌంట్‌ ఎలా అయితే ఉందో అలానే తన డిటెయిల్స్ అన్నీ మార్చేశాడు. డీపీ, ట్యాగ్‌లైన్‌ ఒకేలా ఉండేలా జాగ్రత్తపడ్డాడు. అప్పటికే రాకెట్ వేగంతో ఈ అకౌంట్‌ అందరికీ చేరువైపోయింది. ఇది ఫేక్ అకౌంట్ అని నిర్ధరణ అయ్యాక నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేసి ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు. 








మస్క్‌ ఎంట్రీతో ఎన్నో మార్పులు..


ట్విటర్‌ బాస్ అయిన మరుక్షణమే మస్క్ చేసిన పని షాక్‌కి గురి చేసింది. భారత సంతతికి చెందిన CEO పరాగ్ అగర్వాల్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. నిజానికి..అంతకు ముందు నుంచే మస్క్, పరాగ్ అగర్వాల్ మధ్య సైలెంట్‌గా వైరం నడుస్తూనే ఉంది. ట్విటర్ వేదికగా రెండు మూడు సార్లు వీళ్ల మధ్య యుద్ధం కూడా నడిచింది. ఒకానొక సమయంలో "మస్క్ నిబంధనలకు లోబడటం లేదు" అని డీల్ కుదుర్చుకునే
సమయంలో ట్విటర్ మేనేజ్‌మెంట్‌పై ఆయనపై ఫైర్ అయింది. సరే. ఈ కథంతా ముగిసింది కానీ...మస్క్ మాత్రం అది మనసులో పెట్టుకున్నట్టున్నాడు. బాస్ అయిన వెంటనే ఎగ్జిగ్యూటివ్ స్థాయిలో ఉన్న వారిని ఇంటికి పంపారు. ఈ లేఆఫ్‌లు ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులతోనే ఆగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ...మస్క్ ట్విస్ట్ ఇచ్చారు. కింది స్థాయి ఉద్యోగులకూ ఉద్వాసన పలికేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు. దాదాపు సగం మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నట్టు ఇప్పటికే కొన్ని రిపోర్ట్‌లు చెబుతున్నాయి. అయితే..ABP News సోర్సెస్ ప్రకారం తెలుస్తోంది ఏంటంటే...ఇండియన్ ఎంప్లాయిస్‌ను టార్గెట్ చేసుకుని మరీ వారిని తొలగించాలని చూస్తున్నారట. కొందరు ఈ మేరకు సమాచారం కూడా ఇచ్చారు. ట్విటర్ బ్లూ యూజర్స్ "Blue Tick"ని మెయింటేన్ చేయాలంటే నెల నెలా 8 డాలర్లు చెల్లించాలని ప్రకటించారు ఎలన్ మస్క్. 


Also Read: Twitter: సగానికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన ఖాయం - హింట్ ఇస్తున్న ఎలాన్ మస్క్!