Layoff turns into goldmine for techie : పనేమీ ఉండని ఉద్యోగం దొరికితే ఎంత హాయిగా ఉంటుంది.. అది కూడా ఏటా రూ. మూడు కోట్ల జీతం వచ్చే ఉద్యోగం. అంత కంటే ఇంకేం కావాలి...అని ధాంక్ గాడ్ అనుకుంటాం. ఇలాంటి అవకాశం చాలా కొద్ది మందికే వస్తుంది. అలాంటి వ్యక్తి ఒకరు ఆన్ లైన్‌లో తారసరపడ్డారు. ఆ వ్యక్తి అనుభవాన్ని విని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
పేరు తెలియని ఓ ఉద్యోగి మొదట గూగుల్‌లో ఉద్యోగం చేసేవారు. గూగుల్ లేఆఫ్స్ జాబితాలో అతని పేరు పెట్టింది. వెంటనే అతను టెర్మినేషన్ డేట్ దగ్గర పడేసరికి అమెజాన్ లో చేరిపోయాడు. చేరి సంవత్సరంన్నర అయింది. కానీ ఇప్పటి వరకూ అతనికి పనేమీ చెప్పలేదు. కానీ జీతం..భత్యాలు.. వేరియబుల్ పే లాంటివి మాత్రం ఫుల్‌గా స్తున్నాయి. ఎలా చూసినా .. ఏటా రూ. మూడు కోట్ల రూపాయలు ఖాతాలో పడిపోతున్నాయి. ఆయన తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అమెజాన్ లో చేరి ఏడాదిన్నర అయిందని .. ఈ కాలంలో కేవలం ఏడు టిక్కెట్స్ మాత్రమే పరిష్కరించానన్నారు. అలాగే చాట్ జీపీటీ ఉపయోగించి చేసిన ఓ ప్రాజెక్టును.. మూడు నెలల పాటు చేసినట్లుగా రిపోర్టు ఇచ్చారు. అంతకు మించి తాను చేసిందేమీ లేదన్నారు. ఆమెజాన్ గోల్ సెట్టింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. దాన్ని కూడా ఆ ఉద్యోగి సులువుగానే మోసం స్కిప్ చేయగలిగారు. సోషల్ మీడియాలో ఈ పోస్టు చూసి చాలా మంది షేర్ చేసుకుంటున్నారు. [
కొంత మంది ఇలాంటి అదృష్టవంతులు చాలా చోట్ల ఉంటారని చెప్పుకొచ్చారు. కొంత మంది ఉద్యోగాల్లో రెండు గంటలు పని చేస్తారని అయితే ఎనిమిది గంటల జీతం తీసుకుంటారన్నారు. కొంత మంది ఎనిమిది గంటల పాటు పని చేసి రెండు గంటల జీతమే పొందుతారని.. కార్పొరేట్ కంపెనీల్లో ఇలాంటి వారు ఎక్కువగా ఉంటారని చెప్పుకొచ్చారు.
కొంత మంది ఇలా ఏ పనీ చేయకపోవడం పెద్ద నష్టమని.. అది కంపెనీకి కాదని... ఆ ఉద్యోగికని చెబుతున్నారు.