అన్వేషించండి

Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !

Rajinikanth Wife New Platform : రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ 'మక్కల్ మడై' పేరిట కొత్త వేదికను ప్రారంభించారు. ఇది సామాజిక సేవా సంస్థా లేక రాజకీయ అడుగులా అన్న దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

Makkal Madai Political Party:  తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్  మక్కల్ మడై   అనే సరికొత్త సామాజిక-రాజకీయ వేదికను ప్రారంభించడం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.  మక్కల్ మడై అంటే ప్రజల వేదిక అని అర్థం. ఒకవైపు నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం, మరోవైపు మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన తరుణంలో లతా రజనీకాంత్ తీసుకున్న ఈ నిర్ణయం తమిళ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 

 ఏంటి ఈ 'మక్కల్ మడై'? 

 'మక్కల్ మడై' అనేది ఒక స్వచ్ఛంద , సామాజిక వేదిక. ప్రజల సమస్యలను వినడానికి, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, మరియు వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడటానికి, వారి గొంతును ప్రభుత్వానికి వినిపించడానికి ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు  లతా రాజకనీతాంత్   ప్రకటించారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఇదొక సమిష్టి వేదిక అని, దీనికి ఎలాంటి రాజకీయ రంగు లేదని ఆమె ప్రాథమికంగా వెల్లడించారు.  

 ఇది రాజకీయ అరంగేట్రమేనా? 

లతా రజనీకాంత్ దీనిని కేవలం సామాజిక సంస్థగా అభివర్ణిస్తున్నప్పటికీ,   దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉండవచ్చని  భావిస్తున్నారు.  గతంలో రజనీకాంత్ 'రజనీ మక్కల్ మన్రం' ద్వారా రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించి, చివరి నిమిషంలో ఆరోగ్యం సహకరించక వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఆయన భార్య 'మక్కల్ మడై' పేరుతో ప్రజల్లోకి రావడం.. రజనీకాంత్ అభిమానులను మళ్లీ ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నమేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జనీకాంత్‌కు తమిళనాడులో ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంక్,  అభిమాన గణం ఉన్నారు. 'మక్కల్ మడై' ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతును కూడగట్టి, ఎన్నికల సమయంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి? లేదా ఏ కూటమి వైపు నిలబడాలి? అనే విషయాన్ని శాసించే శక్తిగా ఎదగడానికి లతా రజనీకాంత్ ప్రణాళికలు రచిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. 

 మిత్రపక్షాల సమీకరణాలు - ఎవరికి లాభం? 

రజనీకాంత్‌కు కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల అన్నామలై బీజేపీని వీడి కొత్త ప్రాంతీయ పార్టీ పెడుతున్న తరుణంలో, లతా రజనీకాంత్ ఈ వేదికను ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. ఈ సంస్థ భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారకపోయినా, ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలకు వ్యతిరేకంగా వచ్చే కొత్త శక్తులకు  పరోక్షంగా మద్దతు ఇచ్చేలా రజనీకాంత్ అభిమానులను సిద్ధం చేయడానికి ఈ వేదిక ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
AP Cabinet Special Task Force: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
Embed widget