Bengaluru Wing Commander Attack Case: బెంగళూరు ఎయిర్ పోర్టుకు వెళ్తున్న సమయంలో కొంత మంది తమను అడ్డుకుని దాడి చేశారని తీవ్ర గాయాలయ్యాయి కానీ పోలీసులు పట్టిచుకోలేదని డీఆర్‌డీవోలో పని చేస్తున్న వింగ్ కమాండర్ శిలాదిత్య బోస్, ఆతని భార్య స్కాడ్రన్ లీడర్ మథుమిత ఆరోపణలు కీలక మలుపులు తిరుగుతున్నారు. వీరిద్దరూ రక్షణ శాఖకు చెందిన ఉద్యోగులు కావడం.. కన్నడ మాట్లాడలేదన్న కారణంగా ఇతరులు దాడి చేశారని ఆరోపణలు రావడంతో ఈ అంశం జాతీయంగా కలకలం రేగింది. బెంగళూరులో శాంతిభద్రతల పరిస్థితిపైనా చర్చలు ప్రారంభమయ్యాయి.

శిలాదిత్య బోస్ సోషల్ మీడియాలో వీడియో పెట్టడంతో  అది వైరల్ అయింది. దేశం కోసం పని చేస్తున్న వారికి ఇదేనా బెంగళూరులో లభించే ట్రీట్‌మెంట్ అని ప్రశ్నలు వచ్చాయి. అయితే పోలీసులు ఈ ఘటనపై పూర్తి సమాచారం సేకరించారు. అది ట్రాఫిక్ సమస్య కారణంగా ఏర్పడిన వివాదంగా గుర్తించారు.  

[ఓ బైకర్ తో శిలాదిత్య, అతని భార్య గొడవ పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బైకర్ పై మొదట శిలాదిత్యనే దాడి చేసినట్లుగా వీడియోలో ఉంది. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఆయనే తోసేశాడు. అక్కడే గొడవ జరిగినట్లుగా ఉంది.

సోషల్ మీడియాలో ఈ సీసీ ఫుటేజీలు వైరల్ కావడంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.  వీడియో ఫుటేజీ వెలుగులోకి రావడంతో వింగ్ కమాండ్ పైనా పోలీసులు కేసులు పెట్టారు.  

వింగ్ కమాండర్ కన్నడిగపై దాడి చేశారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ప్రకటించారు.