Bajrang Dal Ban: 


కఠిన చర్యలు..


కర్ణాటకలో హిజాబ్‌ తరవాత అంతగా హీట్‌ ఎక్కించిన అంశం బజ్‌రంగ్ దళ్ బ్యాన్. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే హామీ ఇవ్వడం రాష్ట్రంలో రగడకు కారణమైంది. ప్రచారం చివరి దశలో...రాజకీయాలన్నీ దీని చుట్టూనే తిరిగాయి. ఆ హామీపై అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు వివరణ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటైంది. ఇప్పుడు మరోసారి దీనిపై చర్చ జరుగుతోంది. నిజంగానే కర్ణాటక ప్రభుత్వం బజ్‌రంగ్ దళ్‌ని బ్యాన్ చేస్తుందా...అన్న డిబేట్ మొదలైంది. దీనిపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే క్లారిటీ ఇచ్చారు. సమాజంలో విద్వేషాలు, అశాంతికి కారణమయ్యేది ఎవరైనా సరే..సహించేది లేదని తేల్చి చెప్పారు. అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అది PFI అయినా, బజ్‌రంగ్ దళ్ అయినా...అవే చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఇదే సమయంలో హిజాబ్‌ వివాదంపైనా స్పందించారు. 


"కర్ణాటకలో అనవసరపు అల్లర్లు సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టేది ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాం. అది PFI కానివ్వండి, బజ్‌రంగ్‌ దళ్, RSS..ఇలా ఏ సంస్థైనా సరే. అలాంటి వాటిని సహించేదే లేదు. చట్టపరంగా, రాజ్యాంగ పరంగా కచ్చితంగా చర్యలు తప్పవు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఆ సంస్థల్ని నిషేధించడానికి కూడా వెనకాడం"


- ప్రియాంక్ ఖర్గే, కర్ణాటక మంత్రి 






కర్ణాటకలోని అన్ని విద్యా సంస్థల్లో హిజాబ్‌ని నిషేధిస్తూ గత బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే..ఈ నిర్ణయంపై సిద్దరామయ్య మరోసారి రివ్యూ చేస్తారని చెప్పారు ప్రియాంక్ ఖర్గే. ఈ విషయంలో తమ స్టాండ్‌ స్పష్టంగానే ఉందని తెలిపారు. 


"హిజాబ్ వివాదం విషయంలో చాలా క్లారిటీతోనే ఉన్నాం. గత ప్రభుత్వ నిర్ణయాన్ని రివ్యూ చేస్తాం. అదొక్కటే కాదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చిన పాలసీలనూ రివ్యూ చేస్తాం. కర్ణాటకకు కొత్త ఇమేజ్ తీసుకొస్తాం. ఉపాధి సృష్టించని బిల్స్‌నీ పక్కన పెట్టేస్తాం. అనైతికంగా తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ఎత్తివేస్తాం"


- ప్రియాంక్ ఖర్గే, కర్ణాటక మంత్రి