Karnataka Minister Priyank Kharge comments : గూగుల్ రూ. 1.3 లక్షల కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో AI హబ్ , గిగావాట్-స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. ఈ అంశంపై కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గేను కొంత మంది జర్నలిస్టులు ప్రశ్నించారు. ఈ పెట్టుబడి ఆంధ్రకు వెళ్లడంతో కర్ణాటకలో రాజకీయ వివాదం రేగింది. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్‌కు ఇచ్చిన ప్రోత్సాహకాలు చాలా ఎక్కువగా ున్నాయన్నారు. భూమి ధరపై 25% సబ్సిడీ, నీటి వినియోగంపై 25% సబ్సిడీ, ఉచిత విద్యుత్ , స్టేట్ GST రీయింబర్స్‌మెంట్ వంటి ప్రోత్సాహకాలు ఇచ్చిందన్నారు. కర్ణాటకలో అలాంటివి ఇస్తే రాష్ట్ర ఆర్థిక స్థితిని దెబ్బతీశారని అని విమర్శలు వస్తాయన్నారు.
ఈ అంశంపై నారా లోకేష్ పరోక్షంగా స్పందించారు. కొంత మంది పొరుగు రాష్ట్రాల మంత్రులకు కడుపుమండుతోందని సెటైర్లు వేశారు. కానీ నేరుగా విమర్శించలేదు.
మరో వైపు ప్రియాంక్ ఖర్గేపై కర్ణాటకలోనే విమర్శలువస్తున్నాయి. గూగుల్ ప్రాజెక్టు కర్ణాటకకు రాకపోవడంతో 30,000 ఉద్యోగాలు, రూ. 10,000 కోట్ల ఆదాయం కోల్పోయామని ఆరోపణలు. ఖర్గే సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ, "అలాంటి పెట్టుబడులు ఆకర్షించే సామర్థ్యం ఉందా?" అని BJP ట్వీట్ చేసింది. ఖర్గే "ట్విట్టర్ వార్‌లో మునిగిపోయారు, పెట్టుబడులు ఆకర్షించడంపై ఫోకస్ లేదు" అని జేడీఎస్ విమర్శించింది. పవర్ కట్స్, కరప్షన్, బెంగళూరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
ఈ అంశంపై కర్ణాటక పారిశ్రామిక వేత్తలు కూడా స్పందిస్తున్నారు. ఖర్గే చెప్పిన సమాధానం పై ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్ దాస్ పాయ్ కూడా అసహనం వ్యక్తం చేశారు. ఉచితాలతో పోలిస్తే ఇవి ఇవి చాలా తక్కువ సబ్సిడీలన్నారు.
మరో వైపు సాధారణ పౌరులు కూడా ఖర్గే సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.