Karnataka Oil Kumar Drinks 8 Litres of Engine Oil Daily:  కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా నివాసి ఒక వ్యక్తిని స్థానికంగా అందరూ ఆయిల్ కుమార్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అతని ఆహారం ఇంజిన్ ఆయిల్ మాత్రమే.  సాధువు వేషంలో ఉండే ఈ వ్యక్తి  33 సంవత్సరాలుగా ఏ ఆహారం తీసుకోకుండా కేవలం 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ ,  టీతోనే జీవిస్తున్నానని ప్రకటించుకున్నాడు. కొంత మంది అన్నం, చపాతీ ఆఫర్ చేసినా ని తిరస్కరించి, బాటిల్ నుండి నేరుగా ఇంజిన్ ఆయిల్ తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. 

సోషల్ మీడియా వీడియోలో ‘ఆయిల్ కుమార్’ చుట్టూ కూర్చున్న స్థానికులు అతనికి భోజనం ఆఫర్ చేస్తున్నారు. “అన్నం, చపాతీ తినండి” అంటూ చెప్పినప్పుడు, అతను నవ్వుతూ తిరస్కరిస్తూ, “నేను 33 సంవత్సరాలుగా ఆహారం తీసుకోలేదు. రోజుకు 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ మరియు టీతోనే జీవిస్తున్నాను” అని చెప్పాడు. వీడియోలో అతను బాటిల్ నుండి ఆయిల్‌ను సులభంగా తాగుతున్న దృశ్యాలను చూసి  నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. 

ఆయిల్ కుమార్ శివమొగ్గ జిల్లా సాధారణంగా రోడ్లపై తిరుగుతూ జీవిస్తున్నాడు. స్థానికుల ప్రకారం, అతను ఎప్పుడూ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండానే ఉన్నాడు. “అతను ఎప్పుడూ ఆయిల్ బాటిల్స్‌తోనే కనిపిస్తాడు. మేము  ఆఫర్ చేసిన ఆహారాన్ని తిరస్కరిస్తాడు” అని ఒక స్థానికుడు తెలిపాడు.  

వైద్య నిపుణుల దీన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నారు. ఇంజిన్ ఆయిల్‌లో పెట్రోలియం ఆధారిత కాంపౌండ్లు, హైడ్రోకార్బన్లు, హెవీ మెటల్స్ (లెడ్, బెంజిన్ వంటివి) ఉంటాయి. ఇవి అత్యంత విషపు , క్యాన్సర్ కారకాలు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పాయిజన్ కంట్రోల్ సెంటర్ (AAPCC) ప్రకారం, ఇంజిన్ ఆయిల్ తాగడం వల్ల శ్వాసకోశాల్లోకి  ఆయిల్ ప్రవేశించి  ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, న్యుమోనియా, ఊపిరితిత్తుల ఇరిటేషన్ వంటి  సమస్యలు తలెత్తుతాయి. వేగంగా చనిపోవడానికి అవకాశం  ఉంటుంది.  ఇంజిన్ ఆయిల్ తాగడం అనేది మెడికల్ ఎమర్జెన్సీ అని అంటున్నారు.