Karnataka leadership crisis:  కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయ ఉద్రిక్తతలు తగ్గించేందుకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాంగ్రెస్‌ ప్రెసిడెంట్ మలికార్జున్ ఖర్గే, ఏపీసీసీ అధ్యక్షుడు డీకేఎస్ శివకుమార్ మధ్య శనివారం ఉదయం జరిగిన బ్రేక్‌ఫాస్ట్  సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి పదవి కేటాయింపు, పార్టీ అంతర్గత వివాదాలు, రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం వంటి కీలక అంశాలపై చర్చించారు.  ఈ సమావేశం కాంగ్రెస్‌లో డీకేఎస్ , సిద్దరామయ్య  మధ్య ఏర్పడిన రాజకీయ అశాంతిని తగ్గించడానికి జరిగింది.  హైకమాండ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ  బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తర్వాత అందరూ సమైక్యంగా ఉన్నట్లుగా సంకేతాలు పంపించారు.  కర్ణాటకలో మే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ  డీకే శివకుమార్ సీఎం పదవి  రాలేదు. సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా చేస్తూ, డీకేఎస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. రెండున్నరేళ్ల ఫార్ములాను హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. ఇప్పుడు రెండున్నరేళ్లు పూర్తి కావడతో   డీకేఎస్ అనుచరులు  పదవి మార్పుకు డిమాండ్ చేస్తూ ఢిల్లీ వెళ్లారు.ఆ వివాదం రాను రాను పెద్దది అయింది. చివరికి   కాంగ్రెస్ హైకమాండ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.  

Continues below advertisement

సమావేశం ఉదయం 9 గంటలకు మలికార్జున్ ఖర్గే నివాసంలో బ్రేక్ ఫాస్ట్ సమావేశం ప్రారంభమైంది. దాదాపు ఒక గంట సేపు జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి పదవి మార్పు అవకాశాలు, రాష్ట్రంలో ప్రభుత్వ స్థిరత్వం, రాబోయే స్థానిక ఎన్నికలు వంటివి చర్చనీయాంశాలుగా నిలిచాయి.  శివకుమార్ పార్టీ ఐక్యతకు తనవంతు కృషి చేస్తాను అని చెప్పగా, సిద్దరామయ్య ప్రభుత్వాన్ని స్థిరంగా నడిపిస్తానని హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. 

 డీకేఎస్ శివకుమార్ పదవి మార్పు డిమాండ్‌ను మొదటిసారి అధికారికంగా చర్చించారు. అయితే, హైకమాండ్ ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు అసాధ్యం అని సూచించినట్లుగా తెలుస్తోంది.  రెండు వర్గాల మధ్య టెన్షన్‌లను తగ్గించేందుకు  కామన్ మినిమమ్ ప్రోగ్రామ్  ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డీకేఎస్ అనుచరులు మంత్రి పదవులు, జిల్లా అధ్యక్షత పదవుల్ని డిమాండ్ చేశారు. 2028 ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేయాలని, బీజేపీ వ్యూహాలకు కౌంటర్ ఇవ్వాలని చర్చించారు. మలికార్జున్ ఖర్గే  సానుకూల చర్చలు జరిగాయని.. పార్టీ ఐక్యంగా ఉంటుందన్నారు.  పార్టీ కోసం ఏమైనా చేస్తానని   ముఖ్యమంత్రిని సపోర్ట్ చేస్తాననని శివకుమార్ తెలిపారు.  

Continues below advertisement

ఈ సమావేశానికి బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కాంగ్రెస్‌లో అంతర్గత యుద్ధం. బ్రేక్‌ఫాస్ట్‌తో సమస్యలు పరిష్కారం కాదని ఎద్దేవా చేశారు.   ఈ సమావేశం కర్ణాటక కాంగ్రెస్‌కు తాత్కాలిక ఊరట ఇచ్చినా, ముఖ్యమంత్రి పదవి వివాదం పూర్తిగా పరిష్కారం కాలేదన్న అభిప్రాయానికి వస్తున్నారు.  రాష్ట్రంలో ప్రస్తుతం 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా, డీకేఎస్ వర్గం 40 మంది, సిద్దరామయ్య వర్గం 60 మంది  ఉన్నారు.