Kannada was born from Tamil: తమిళనాడు, కర్ణాటకలో భాషా వివాదాలు తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే ఈ రెండు భాషలు ఎక్కువగా హందీనే టార్గెట్ చేసుకుంటాయి. కానీ ఇప్పుడు తమిళం, కన్నడం మద్య పంచాయతీని కమల్ హాసన్ పెట్టారు. చెన్నైలో జరిగిన తన కొత్త చిత్రం *థగ్ లైఫ్* ఆడియో విడుదల కార్యక్రమంలో "కన్నడ భాష తమిళ్ నుంచి పుట్టిందని " ప్రకటించారు. కమల్ తన ప్రసంగంలో " నా జీవనం, నా కుటుంబం తమిళం అని చెప్పారు. తరవాత అదే వేదికపై ఉన్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వైపుచూస్తూ.. మీ భాష కన్నడ తమిళ్ నుంచి జన్మించింది, కాబట్టి మీరు కూడా తమిళ కుటుంబంలో భాగమే అని చెప్పారు. కమల్ మాటలు వైరల్ అయ్యాయి.
కమల్ హాసన్ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తప్పుబట్టారు, "కన్నడ భాషకు 2,500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందన్నారు. కమల్‌కు ఈ విషయం తెలియదన్నారు.
బీజేపీ నాయకుడు బి.వై. విజయేంద్ కూడా కమల్ వ్యాఖ్యలను అహంకారం గా అభివర్ణించారు. కన్నడ భాషను అవమానించడం ద్వారా 6.5 కోట్ల కన్నడిగుల స్వాభిమానాన్ని గాయపరిచారని, కమల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అతను కన్నడ చిత్రాల్లో నటించినప్పటికీ, కన్నడిగుల పట్ల "కృతఘ్నత" చూపాడని ఆరోపించారు.
ఇక కన్నడ ఉద్యమ సంస్థలు తెరపైకి వచ్చాయి. కన్నడ రక్షణ వేదిక మల్ వ్యాఖ్యలను అవమానకరంగా ఉన్నాయన్నారు. కర్ణాటకలో వ్యాపారం చేయాలనుకుంటే, కన్నడాన్ని అవమానించడం మానుకో అని కన్నడ రక్షణ వేదిక కమల్‌ను హెచ్చరించింది. బెంగళూరులో *థగ్ లైఫ్* బ్యానర్లను చించివేసి, కమల్‌పై నల్ల సిరా వేయాలని ప్లాన్ చేసినప్పటికీ, తప్పించుకున్నాడన్నారు.
తమిళనాడు బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ కూడా కమల్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. భాషల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. కమల్ హాసన్ డీఎంకేను సంతోషపెట్టడానికి ఇతర భాషలను విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. కన్నడ సోషల్ మీడియాలో *థగ్ లైఫ్* చిత్రాన్ని బహిష్కరించాలని పిలుపులు వచ్చాయి. కొందరు కన్నడ భాషకు 56 అక్షరాలు ఉండగా, తమిళంలో 26 అక్షరాలు మాత్రమే ఉన్నాయని, కన్నడం తమిళం నుంచి జన్మించలేదని వాదిస్తున్నారు.