Air Quality Index In Andhra Pradesh And Telangana : తెలంగాణ(Telangana)లో ఆదివారం గాలి నాణ్యత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AOI) 64గా నమోదైంది. అయితే ఎప్పటిలాగానే బెల్లంపల్లిలో మాత్రం నాణ్యతా అంతబాగా లేదు. బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, కొత్తపేట, రామగూడెం ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాద స్థాయికి చేరింది. తెలంగాణలో గాలిలో 2.5 పీఎం దూళి కణాలు 1.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెల్లడించింది. అన్ని జిల్లాలో PM 10కి పైనే ఉంది. గాలిలో PM 2.5 స్థాయికి మించితే అది ప్రమాదం తెచ్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. ఈ పరిస్థితిలో గాలి ఊపిరి తిత్తులలోకి ప్రవేశిస్తే ఉబ్బసం, శ్వాస కోస సమస్యలు వస్తాయి. గుండె కొట్టుకోవడంలోనూ వ్యత్యాసాలు వస్తాయి. అలాగే వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్(Hyderabad)లోనూ వాయు నాణ్యత ప్రమాణం 53గా నమోదైంది. ఇక తెలంగాణ లో సూర్యోదయం తెలంగాణలో సూర్యోదయం 6.26 నిమిషాలు కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6.26.
తెలంగాణ వాతావరణం :
తెలుగు రాష్ట్రాలకు ఇంకా వర్షాకాలం వచ్చినట్టు అనిపించలేదు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ పక్కన పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో చిన్న తుఫాను ఏర్పడింది. అటు కేరళ నుంచి కూడా గాలులు వచ్చే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాలు చల్లబడే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మాత్రం సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వనపర్తి, జగిత్యాల, నిజామాబాద్, సిద్ధిపేట, సిరిసిల్ల, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎల్లో అలర్ట్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో..
తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్(AP)లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెరుగ్గా ఉంది. ఇక్కడి వాయు నాణ్యత గా నమోదైంది. ఆంధ్ర ప్రదేశలో ఏ ఒక్క ప్రాంతం లో కూడా వాయు నాణ్యతా బాగా లేకుండా లేదు. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువులు కూడా చాలా తక్కువగా ఉన్నట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెల్లడించింది.
ఇక వాతావరణం విషయానికి వస్తే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోవ్ ప్రవేశించి కొద్దికాలం అయినప్పటికీ అనుకున్న స్థాయిలో వర్షం కురవలేదు చాలా ప్రాంతాల్లో మినిమం వర్షపాతం కూడా నమోదవ్వలేదు. ఇప్పటికీ రాష్టమ లో వేసవి గడుస్తున్నటు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమయంలో వాతావరణ శాఖ మంచి విషయం చెప్పింది. గుజరాత్-కర్ణాటక తీరం నుండి విస్తరించిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. అలాగే దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వెల్లడించింది.