Joe Biden:


జీ 20 సదస్సులో..


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ మధ్య కాలంలో తన వైఖరితోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా..ఏదో వింతగా ప్రవర్తించి అందరినీ షాక్‌కి గురి చేస్తున్నారు. ఆ మధ్య ఓ మీటింగ్‌కు వెళ్లి డయాస్‌పై ఎటు వెళ్లాలో కన్‌ఫ్యూజ్‌ అయ్యారు. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఆ తరవాత కూడా రెండు మూడు సమావేశాల్లో ఇలానే కన్‌ఫ్యూజ్ అయ్యారు బైడెన్. ఇప్పుడు G-20 సదస్సులో భాగంగా ఇండోనేషియాలోని బాలికి వెళ్లగా...అక్కడ బైడెన్ నడుస్తూ నడుస్తూ తడబడ్డారు. ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.  మాంగ్రోవ్ అడవిలోని ఓ ఆలయానికి దేశాధినేతలు వెళ్లారు. ఆ సమయంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా వెళ్లారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆయనకు స్వాగతం పలికారు. దగ్గరుండి మరీ ఆలయంలోకి ఆహ్వానించారు. అక్కడే మెట్లున్నాయి. ఆ మెట్లు ఎక్కే క్రమంలోనే బైడెన్ ఒక్కసారిగా తడబడ్డారు. బైడెన్ కిందకు ఒరిగిపోతుండగా...ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడోడో ఆయనను పట్టుకున్నారు. ఆ తరవాత లోపలకు వెళ్లి ఇతర దేశాధినేతల్ని పలకరించారు. 






గతంలోనూ..


ఇటీవల జరిగిన ఓ మీటింగ్‌లో చనిపోయిన ఆవిడ పేరుని పిలుస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు బైడెన్. ఇప్పుడు మరో చోట ఇలాంటి ప్రవర్తనతోనే అందరినీ షాక్‌కు గురి చేశారు. ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (FEMA)ఆఫీస్‌లో అందరితో మాట్లాడారు. హరికేన్ ఇయాన్‌ సహాయక చర్యల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నందుకు FEMAను ప్రశంసించారు. ఈ స్పీచ్ పూర్తయ్యాక...ఉన్నట్టుండి పక్కకు వెళ్లారు బైడెన్. అక్కడి క్రౌడ్ వద్దకు వెళ్లి అందరికీ షేక్ హ్యాండ్‌ ఇచ్చి పలకరించారు. RNC Research అఫీషియల్ ట్విటర్ పేజ్‌లో ఈ వీడియో పోస్ట్ చేశారు. స్పీచ్ పూర్తిగా కాగానే థాంక్యూ అని వెంటనే కుడి వైపు తిరిగారు. పక్కనే ఉన్న ఫెమా అధికారి ఒకరు "మిస్టర్ ప్రెసిడెంట్" అని పిలుస్తూనే ఉన్నారు. అయినా...ఆమెను పట్టించుకోకుండా తన దారిన తాను వెళ్లారు బైడెన్. అందరికీ వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెట్టారు. "ఇదెంతో బాధాకరం" అని కొందరు రెస్పాండ్ అవ్వగా...మరి కొందరు ఇదేంటి అలా వెళ్లిపోతున్నాడంటూ కామెంట్ చేశారు.