ISRO to Launch Communication Satellite BlueBird Block : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరోసారి ప్రపంచానికి తన శక్తిని, విశ్వసనీయతను చాటి చెప్పింది. తక్కువ బడ్జెట్, కచ్చితమైన సాంకేతికత, గొప్ప బాధ్యతతో ISRO బుధవారం ఉదయం చరిత్ర సృష్టించింది. తమ అత్యంత శక్తివంతమైన రాకెట్ LVM3 ద్వారా అమెరికాకు చెందిన నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ కేవలం సాంకేతిక విజయమే కాదు, అంతరిక్ష రంగంలో భారతదేశాన్ని ఒక విశ్వసనీయ గ్లోబల్ లీడర్‌గా నిలబెడుతుంది.
బాహుబలి రాకెట్ LVM3 చారిత్రాత్మక ప్రయాణం
శ్రీహరికోట నుంచి బుధవారం ఉదయం సరిగ్గా 8 గంటల 54 నిమిషాలకు LVM3 రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. ఇది LVM3 యొక్క ఆరవ ఆపరేషనల్ ప్రయోగం, ఇది అంతరిక్షంలో ఒక కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ మిషన్ కింద, 6,100 కిలోల బరువున్న అమెరికన్ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్-2ను లో ఎర్త్ ఆర్బిట్‌లో స్థాపించారు. ISRO ప్రకారం, ఇది LVM3 విజయవంతంగా ప్రయోగించిన అత్యంత భారీ పేలోడ్. ఇంతకుముందు ఈ రికార్డు CMS-03 పేరు మీద ఉండేది.
మొబైల్ టవర్ లేకుండా 4G-5G కనెక్టివిటీ
బ్లూబర్డ్ బ్లాక్-2 శాటిలైట్ యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే, ఇది మొబైల్ టవర్ లేదా అదనపు యాంటెన్నా లేకుండా నేరుగా స్మార్ట్‌ఫోన్‌లకు 4G మరియు 5G నెట్‌వర్క్‌ను అందిస్తుంది. ఈ సాంకేతికత హిమాలయాలు, ఎడారులు, సముద్రాలు, విమానాలు వంటి ప్రదేశాలలో కూడా అంతరాయం లేని కనెక్టివిటీని అందించగలదు.
బ్లూబర్డ్ బ్లాక్-2 (BlueBird Block-2) శాటిలైట్ అనేది అమెరికాకు చెందిన AST SpaceMobile కంపెనీ తయారు చేసిన నెక్స్ట్-జెనరేషన్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఇది సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు నేరుగా 4G/5G ఇంటర్నెట్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, మెసేజింగ్ అందించే ప్రపంచంలోనే మొదటి రకం సాంకేతికత!
బ్లూబర్డ్ బ్లాక్-2 గురించి ముఖ్య వివరాలు
బరువుసుమారు 6,100 కిలోలు (6.1 టన్నులు) – LEO (లో ఎర్త్ ఆర్బిట్)లోకి ప్రయోగించిన అత్యంత బరువైన కమర్షియల్ శాటిలైట్ (ఇస్రో చరిత్రలో LVM3 రాకెట్ ద్వారా)
సైజ్ 223 చదరపు మీటర్లు (సుమారు 2,400 చదరపు అడుగులు) phased array – ఇది లో ఎర్త్ ఆర్బిట్‌లో ఎప్పుడూ డిప్లాయ్ చేసిన అతిపెద్ద కమర్షియల్ ఫేజ్డ్ అరే ఆంటెన్నా.
సామర్థ్యంమునుపటి బ్లాక్-1 శాటిలైట్‌ల కన్నా 10 రెట్లు ఎక్కువ బ్యాండ్‌విడ్త్ డేటా కెపాసిటీ.
పీక్ స్పీడ్ప్రతి కవరేజ్ సెల్‌లో 120 Mbps వరకు (వాయిస్, డేటా, వీడియో స్ట్రీమింగ్ సపోర్ట్).
ఆర్బిట్లో ఎర్త్ ఆర్బిట్ (LEO) – సుమారు 520-600 కి.మీ ఎత్తు.
ప్రత్యేకతస్పెషల్ హార్డ్‌వేర్ లేకుండా సాధారణ మొబైల్ ఫోన్‌లతోనే కనెక్ట్ అవుతుంది – మారుమూల ప్రాంతాలు, సముద్రాలు, పర్వతాలు, ఎడారుల్లో కూడా సిగ్నల్ ఇస్తుంది. ఇస్రో యొక్క LVM3-M6 (బాహుబలి) రాకెట్ ద్వారా డిసెంబర్ 24, 2025న విజయవంతంగా ప్రయోగించింది. ఇది భాగత్ కమర్షియల్ స్పేస్ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘట్టం. ఇలాంటి టెక్నాలజీతో భవిష్యత్ లో మొబైల్ కనెక్టివిటీ పూర్తిగా మారిపోతుంది. గ్రామాలు, పర్వతాలు, సముద్రాల్లోనూ సిగ్నల్ ఉంటుంది