Insta Queen Punjab Cop Sacked: అమన్ దీప్ కౌర్. పంజాబ్ లోని బతిండా పోలీస్ స్టేషన్ సీనియర్ మహిళా కానిస్టేబుబుల్. కళా పోషకరాలు కూడా. ఆమె ఇన్ స్టా కలర్ ఫుల్ గా ఉంటుంది. కానీ ఆమెలో మరో కళ కూడా ఉంది. అదేమిటంటే డ్రగ్స్. ఆమే సేవిస్తుందో లేకపోతే అమ్ముతుందో తెలియదు కానీ కొకైన్ తో పట్టుబడింది. దీంతో ఆమెను పోలీసు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.
పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్ కంట్రోల్ చేయడానిక ి 'యుధ్ నషేయన్ విరుధ్' పేరుతో ఓ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న సమాచారం వారికి వచ్చింది. దాంతో పోలీసులు, యాంటీ-నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ANTF)తో కలిసి బతిండాలోని బాదల్ ఫ్లైఓవర్ సమీపంలో దాడులు చేశారు. అక్కడ అతి వేగంగా వెళ్తున్న ఓ థార్ వాహనాన్ని అడ్డుకుని సోదాలు చేశారు. 17.71 గ్రాముల హెరాయిన్ దొరికింది. కారుణలో ఉన్న వారు ఎవరో తెలుసుకుని ఆశ్చర్యపోయారు. సీనియర్ కానిస్టేబుల్ అమన్ దీప్ కౌర్ తో పాటు జస్వంత్ సింగ్ అనే వ్యక్తి కూడా కారులో ఉన్నారు. ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఆ కానిస్టేబుల్ తో పాటు జశ్వంత్ సింగ్ పై పై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం కింద అభియోగాలు మోపారు. "పోలీస్_కౌర్‌దీప్" అనే పేరుతో అమన్ దీప్ కౌర్ ఇన్ స్టా అకౌంట్ నడుపుతున్నారు. తన థార్ వాహంతో రీల్స్‌ను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుంది. చాలా వీడియోలలో కౌర్ తన యూనిఫాంలో లోనే రీల్స్ చేస్తారు. పంజాబీ పాటలను హమ్ చేస్తూ కని ఖరీదైన ఐఫోన్ , ఖరీదైన యాక్సెసరిస్‌తో ఆమె రీల్స్ చేస్తారు. కౌర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 37,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. పంజాబ్ పోలీస్ నిబంధనల ప్రకారం "యూనిఫాంలో మోడలింగ్" చేస్తున్నట్లు చూపించే కంటెంట్‌ను పోస్ట్ చేయకూడదు. కానీ కౌర్ ను పట్టించుకోలేదు. చివరికి డ్రగ్స్ కేసులో అరెస్టు అయితే ఆ తప్పును కూడా చార్జ్ షీట్‌లో చేర్చారు.
గుర్మీత్ కౌర్ అనే మహిళ కానిస్టేబుల్ కౌర్ మీద చాలా ఆరోపణలు చేస్తూ పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చింది. ఆమెకు రూ. 2 కోట్ల విలువైన ఇల్లు, రెండు కార్లు మరియు లక్ష విలువైన వాచ్ ఉందని వివరాలు పంపింది. అంతే కాదు తన భర్త సహజీవనం చేస్తోందని ఆరోపించింది. హెరాయిన్ అమ్మడానికి అంబులెన్స్‌ను ఉపయోగించేవారని, గుర్మీత్ కౌర్ ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశారని చెబుతున్నారు. అమన్‌దీప్ కౌర్‌ను గురువారం విధుల నుంచి తొలగించారు. అరెస్టు చేశారు. ఓ వైపు డ్రగ్స్, మరో వైపు వివాహేతర బంధం ఒకే సారి బయటపడటంతో ఆమె వైరల్ గా మారారు.